అమెరికాలోని వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. ట్రంప్ సీరియస్ !
అమెరికా లోని వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వాషింగ్టన్ డీసీలోని అత్యంత రక్షణతో కూడిన ప్రాంతాల్లో ఒకటైన వైట్ హౌస్ సమీపంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ దాడిలో వెస్ట్ వర్జీనియాకు చెందిన ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో గాయపడగా.. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఎవరంటే..?
పోలీసులు నిందితుడిని ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను సైనికుల వద్దకు నేరుగా చేరి కాల్పులు ప్రారంభించాడని నిఘా కెమెరాలు చూపిస్తున్నాయి. అతని దాడి లక్ష్యం ఏమిటి? ప్రత్యేకంగా నేషనల్ గార్డ్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అనే దానిపై FBI దర్యాప్తు ప్రారంభించింది.

మరోవైపు సమాచారం మేరకు ఫస్ట్ రెస్పాండర్లు వెంటనే చేరుకొని ఇద్దరు గార్డ్ సభ్యులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్, డీసీ మేయర్ మురియల్ బౌసర్ ఇద్దరూ "సైనికులు ఇద్దరూ క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు" అని తెలిపారు. మొదట సోషల్ మీడియాలో వచ్చిన "వారు మరణించారు" అనే వార్తలను అధికారులు ఖండించారు. సంఘటన అనంతరం వైట్ హౌస్, మెయిన్ ట్రెజరీ, ఫ్రీడ్‌మెన్స్ బ్యాంక్ బిల్డింగ్‌లు తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, FBI, ATF, సహా అనేక ఫెడరల్ ఏజెన్సీలు స్థలాన్ని దిగ్బంధించాయి.
ఇక రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే విమానాలను FAA తాత్కాలికంగా నిలిపివేసింది. దాడి ప్రాంతం రన్‌వేతో దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు చెప్పారు. కొద్ది సమయం తర్వాత విమాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి.
అయితే థాంక్స్ గివింగ్ కోసం ఫ్లోరిడాలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మన గొప్ప నేషనల్ గార్డ్ పై దాడి చేసిన ఆ జంతువు, ఎంతటి మూల్యమైనా చెల్లిస్తుంది. మన సైన్యం, గార్డ్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం దేవుడు ఆశీర్వదించుగాక. నేను, అధ్యక్షుడిగా, మీతో ఉన్నాను!" అని రాసుకొచ్చారు. అంతేకాక ఈ సంఘటనకు స్పందిస్తూ ట్రంప్ పరిపాలన 500 మంది అదనపు నేషనల్ గార్డ్ సభ్యులను వాషింగ్టన్‌కు రప్పించాలని ఆదేశించింది. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ దాడిని ఖండించారు.
ఆగస్టులో ట్రంప్ స్థానిక పోలీసులను ఫెడరలైజ్ చేస్తూ అత్యవసర ఉత్తర్వు జారీ చేశారు. దీంతో 8 రాష్ట్రాల మరియు డీసీ నుండి నేషనల్ గార్డ్ దళాలను వాషింగ్టన్‌లో మోహరించారు. పహారా, చెక్‌పాయింట్లు, స్టేషన్లలో భద్రతా సేవలు, పబ్లిక్ ఈవెంట్‌ల భద్రత వంటి బాధ్యతలు అప్పగించారు. ఒక ఫెడరల్ న్యాయమూర్తి దళాల మోహరింపును నిలిపివేయాలని ఆదేశించినా.. అప్పీల్ చేసేందుకు 21 రోజుల అవకాశం ఇవ్వడంతో దళాలు ఇంకా నగరంలోనే ఉన్నాయి. ఈ కాల్పుల తర్వాత అమెరికా అంతటా ముఖ్య భవనాలు, రవాణా కేంద్రాల్లో భద్రతను పెంచారు. ప్రత్యేకంగా నేషనల్ గార్డ్ స్థావరాలు, ఫెడరల్ భవనాల వద్ద మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
స్వయానా ట్రంప్ నోట -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications