అమెరికా నైట్‌క్లబ్‌లో మరోసారి కాల్పులు: ఒకరి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఓహియో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. సిన్సిన్నటి నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారు.

ఆదివారం తెల్లవారుజామున ఓ సాయుధుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న ఏడాదిలోపే ఇది జరగడం గమనార్హం. ఓర్లాండో నైట్‌క్లబ్‌ కాల్పుల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 49 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One person was killed and at least 13 people were reported wounded after a gunman opened fire in a Cincinnati, Ohio, nightclub in the wee hours local time on Sunday, reported WLWT5, a local TV station and the Cincinnati Police Department.
Please Wait while comments are loading...