2025 నాటికి ఏలియన్స్ ఆనవాళ్లు, 2045 కల్లా వెలుగులోకి
వాషింగ్టన్: ఇతర గ్రహాల పైన జీవం ఆనవాళ్లను 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, గ్రహాంతర జీవులకు లేదా ఏలియన్స్‌కు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు వచ్చే ఇరవై ముప్పై ఏళ్లలో అంటే 2045 వరకు వెలుగు చూడవచ్చునని నాసాకు చెందిన శాస్త్రవేత్త చెప్పారు.
ఇతర గ్రహాల పైన జీవం ఉందని మరో పదేళ్లలో తెలుస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని ఎలెన్ స్టోఫాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అలాగే, కచ్చితమైన ఆధారాలు మరో రెండు మూడు దశాబ్దాలలో వెలుగు చూడవచ్చునని ఆయన అన్నారు.
ఎక్కడ చూడాలో, ఎలా చూడాలో తెలుసునని చెప్పారు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్‌ఫెల్డ్ అన్నారు.

మనం మన సోలార్ సిస్టంకు మరో జనరేషన్ దూరంలో ఉన్నామని చెప్పారు. హిమయంగా ఉన్న ఏదైనా ఉపగ్రహం కానీ అంగారకుడిపై కానీ సమీపంలోని తార వద్ద కానీ జీవం ఉనికిని కనుగొనే అవకాశం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications