వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్17లో మలేషియా ప్రధాని అమ్మమ్మ, భార్య బతికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: నాలుగు రోజుల క్రితం కూలిన మలేషియా విమానం ఎంహెచ్ 17లో మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌కు అతి సమీప బంధువు, వరుసకు అమ్మమ్మ అయిన శ్రీసితి అమీరా కూడా మృతుల్లో ఉన్నారు. ఇండోనేషియాలో ఉంటున్న ఆమె పండుగ కోసం ముందుగానే ఆమ్‌స్టర్‌డాం నుంచి అక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా ప్రధానినజీబ్ తాత మహమ్మద్ నోవా ఒమర్‌కు అమీరా రెండో భార్య అవుతారు.

భార్య బతికింది.. భర్త చనిపోయాడు

గత మార్చిలో మలేషియా నుండి బీజింగ్ వెళ్తున్న ఎంహెచ్ 370 విమానం అదృశ్యమై అందులోని 239 మంది ప్రయాణీకుల ఆచూకీ తెలియకపోగా.. ఉక్రెయిన్‌లో ఎంహెచ్ 17 మలేషియా విమానం కూల్చివేతలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలు భార్యాభర్తల విషయంలో అనూహ్య, చేదు పరిణామాలకు దారి తీసింది.

వైమానిక సిబ్బందిగా ఉన్న సంజీద్ సింగ్‌కు వాస్తవానికి ఎంహెచ్ 17ను కూల్చివేసే రోజు డ్యూటీ లేదు. కానీ వేరే పని నిమిత్తం షిఫ్ట్ మార్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. సంజీద్ భార్య కూడా మలేషియా ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగి. ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన రోజు ఆమెకు డ్యూ ఉంది. అయితే, షిఫ్ట్ మార్చుకోవడంతో ప్రమాదం నుండి బయటపడింది.

 ఎంహెచ్ 17

ఎంహెచ్ 17

ఎంహెచ్‌-17 విమానంలో రెండు కుక్కలు, ఐదు పక్షులు, నాలుగు పావురాళ్లు, 215 కేజీల పూలు, బట్టలు, హెలికాప్టర్‌, విమాన తయారీ పరికరాలు, దౌత్యపరమైన మెయిల్స్‌తోపాటు దాదాపు వంద కేజీల ఔషధాలు, 1,452 కేజీల లిథియం బ్యాటరీలు ఉన్నాయని కార్గో మేనిఫెస్టో తెలియచేస్తోంది.

 ఎంహెచ్ 17

ఎంహెచ్ 17

మలేషియా విమాన కూల్చివేత ఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్య పైన వచ్చిన విమర్శల నేపథ్యంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ శనివారం క్షమాపణలు కోరింది.

 ఎంహెచ్ 17

ఎంహెచ్ 17

మలేషియా ఎయిర్ లైన్స్ విమానం గురువారం కూల్చివేతకు గురై 298 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఒక వ్యాఖ్య చేస్తూ.. తమ విమానాలు ఉక్రెయిన్ గగనతలం మీదుగా రాకపోకలు చేయవని చెప్పింది.

 ఎంహెచ్ 17

ఎంహెచ్ 17

దీనిపైన విమర్శలు వచ్చాయి. ప్రయాణీకులు తమ విమానాల రాకపోకల పైన సమాచారం కోరుతుండటంతో మార్గాన్ని గురించి ప్రస్తావించామని, అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నామని సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
Singapore Airlines (SIA) has apologised for its "insensitive" social media postings following the crash of Malaysia Airlines aircraft MH17 in eastern Ukraine that left 298 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X