సింగపూర్ ఆధునిక పితామహుడు, మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు

న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు. కొంత కాలంగా న్యూమోనియా కారణంగా ఇబ్బందిపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు.

స్వతంత్ర సింగపూర్‌కు తొలి ప్రధానిగా 1959లో బాధ్యతలు చేపట్టిన ఆయన 1990 దాకా ఆ పదవిలో కొనసాగారు. మూడు దశాభ్దాలుగా పైగా సింగపూర్‌కి ప్రధానిగా పని చేసిన ఆయన సింగపూర్ ఆధునిక పితామహుడిగా పేరుగాంచారు.

Singapore's founding prime minister, Lee Kuan Yew, has died at 91

పీపుల్స్ యాక్షన్ పార్టీ వ్వవస్ధాపకుడైన లీ కున్ యూ సింగపూర్‌ను ఆగ్నేయ ఆసియాలో అతి పెద్ద ఫైనాన్షియల్ సెంటర్‌గా వృద్ధి సాధించేందుకు ఎనలేని కృషి చేశారు. న్యూమోనియా కారణంగా ఫిబ్రవరి 5న ఆయన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.

చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన సింగపూర్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడంతో పాటు, సింగపూర్‌ను ప్రపంచ దేశాల్లో మెరుగైన దేశాల్లో ఒకటిగా నిలపడంలో ఆయన కృషి ఎంతో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+