• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాకు ఒకే ఒక్క టాబ్లెట్ తో చెక్ , హాస్పటల్ కు వెళ్ళకుండానే : గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్, కానీ !!

|

కరోనా మహమ్మారిపై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఫార్మా కంపెనీలు శరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అందులో భాగంగా కరోనావైరస్ మహమ్మారి బారినపడి బాధపడుతున్న రోగులకు యాంటీవైరల్ మెడిసిన్ గా పనిచేయగల టాబ్లెట్ పై అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ట్రయల్స్ నిర్వహిస్తుంది . ఈ ట్రయల్స్ లో సక్సెస్ అయితే, కరోనా మహమ్మారికి ఒకే ఒక ఫైజర్ టాబ్లెట్ తో చెక్ పెట్టవచ్చు.

  Pfizer’s COVID-19 Pill Could Be Available By Year’s End సింగిల్ పిల్ తో కరోనా మాయం | Oneindia Telugu

  భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!

   కరోనాతో పోరాడుతున్న ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్

  కరోనాతో పోరాడుతున్న ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్


  ఫార్మా దిగ్గజం ఫైజర్ కరోనాతో పోరాటం చేస్తున్న ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ -19 నివారణ కోసం ప్రస్తుతం వ్యాక్సిన్స్, కరోనా నియంత్రణ కోసం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్న వేళ టాబ్లెట్స్ ను తీసుకురావడానికి రంగంలోకి దిగింది. ఒకే మాత్ర ద్వారా కరోనా మహమ్మారిని నిరోధించడం కోసం ఫైజర్ ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో ఉన్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైతే, కోవిడ్ -19 మహమ్మారి బారిన పడిన వారు ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేకుండా, ఇళ్లలోనే ఉంచి టాబ్లెట్ల ద్వారా చికిత్స చేయడానికి వీలవుతుంది.

  మొదటి దశ క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ , మనుషులపై ప్రయోగం

  మొదటి దశ క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ , మనుషులపై ప్రయోగం

  ప్రస్తుతం జరుగుతున్న మొదటి దశ క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ లో 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 60 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో ఫైజర్ అభివృద్ధి చేసిన పిల్ యొక్క ఫేజ్ 1 ట్రయల్స్ చెయ్యనుంది. టాబ్లెట్ లకు సంబంధించిన ప్రయోగాలను అమెరికా, బెల్జియంలలోని తమ ఫార్మా ల్యాబ్ లలో ప్రారంభించనుంది ఫైజర్. ప్రోటీజ్ ఇన్హిబిటర్‌గా వర్గీకరించబడిన యాంటీవైరల్ మెడిసిన్ ఇప్పటివరకు జంతువులపై ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో విజయవంతమైంది.

   ఈ ఏడాది చివరివరకు అందుబాటులోకి వస్తాయంటున్న ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా

  ఈ ఏడాది చివరివరకు అందుబాటులోకి వస్తాయంటున్న ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా

  ప్రస్తుతం మానవులపై దీనిని పరీక్షిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి వరకు ఈ టాబ్లెట్స్ అందుబాటులోకి వస్తాయని ఫైజర్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
  కరోనావైరస్ పాజిటివ్ పరీక్షించిన రోగులకు, ఫైజర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చే ఈ టాబ్లెట్ మొట్టమొదటి నోటి ద్వారా ఇచ్చే మెడిసిన్ గా మారుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. కరోనా మహమ్మారికి సంబంధించి ఎన్ని వేరియంట్లు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మందులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు.

   కరోనాకు నోటి ద్వారా తీసుకునే మొదటి మెడిసిన్ , సింగిల్ పిల్ తో కరోనా మాయం

  కరోనాకు నోటి ద్వారా తీసుకునే మొదటి మెడిసిన్ , సింగిల్ పిల్ తో కరోనా మాయం

  ప్రస్తుతం తమ నోటి ద్వారా తీసుకునే మందులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆల్బర్ట్ బౌర్లా పేర్కొన్నారు. అందులో భాగంగానే త్వరితగతిన టాబ్లెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అందరూ భావిస్తున్న తరుణంలో సింగిల్ పిల్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చని ఫైజర్ సంస్థ చెబుతోంది. అందులో భాగంగా నోటి ద్వారా ఈ మెడిసిన్ తీసుకునేలా ఫైజర్ పిల్ తయారు కాబోతుంది.

   కోవిడ్ హోమ్ క్యూర్ పిల్స్ పేరుతో ఫైజర్ ప్రయోగాలు , ఇది యాంటీ వైరల్ డ్రగ్

  కోవిడ్ హోమ్ క్యూర్ పిల్స్ పేరుతో ఫైజర్ ప్రయోగాలు , ఇది యాంటీ వైరల్ డ్రగ్

  అమెరికాలో మొదటిసారిగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫైజర్, అన్ని ట్రయల్ టెస్టులలో తన సామర్ధ్యం బెస్ట్ అని నిరూపితమైన కారణంగా వ్యాక్సిన్ వినియోగానికి అమెరికాలో అనుమతి లభించింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంస్థ కరోనాకు కొత్త ఔషధాన్ని, కోవిడ్ హోమ్ క్యూర్ పిల్స్ పేరుతో తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయోగాలు చేస్తోంది. కరోనా లక్షణాలు బయట పడిన వెంటనే ఈ టాబ్లెట్ తీసుకుంటే యాంటీ వైరల్ డ్రగ్ గా ఈ టాబ్లెట్ పనిచేస్తుందని, తద్వారా కరోనా మహమ్మారి నుండి బయటపడవచ్చని సంస్థ చెప్తుంది. ఈ టాబ్లెట్ త్వరగా రావాలని, కరోనా నివారణకు ఫర్మా సంస్థలు సాగిస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని ఆశిస్తుంది ప్రపంచం .

  English summary
  The pharma giant Pfizer has successfully tested a tablet on animals which can work as antiviral drug for the patients diagnosed with coronavirus. Once a person shows up Covid-19 symptoms, he can consume the pill at home. However, the tablet will be available by year-end as the company is in the process of human trials. Pfizer is getting ready to experiment on 60 health volunteers aged 18 and 60. In a statement, the company said that their pill will become the first orally administered dose for patients tested positive to coronavirus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X