నేపాల్ రోడ్డు ప్రమాదం: ఆరుగురు ఇండియన్స్ మృతి

ఆరుగురు భారతీయ పర్యాటకులు మృతి చెందగా, జీపు డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఖాట్మాండులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్‌లో ప్రముఖ సందర్శన స్థలమైన పొఖ్రా నుంచి ఖాట్మాండ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మృతులందరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరానికి చెందిన వారే. బినయ్ కుమార్ తివారీ (85), హేమంత తిరుపతి (13), కళావతి తివారీ (56), పూనం తిరుపతి (33), నేహా త్రిపాఠి (20), నీలం త్రిపాఠి (36)లుగా గుర్తించారు. మృతదేహాలను ఆస్పత్రిలోనే ఉంచారు.
గాయాలపాలైన వారిలో యుబరాజ్ గురుంగ్, ఆశి దూబే, ఆర్యన్ దూబే, సతేంద్ర దూబే, రబీంద్రకాంత్ త్రిపాఠిలు ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే నీలం త్రిపాఠి మృతి చెందినట్లు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. కాగా ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications