VIRAL VIDEO: ఆరేళ్ల పాకిస్థాన్ చిన్నారి.. అచ్చం రోహిత్ శర్మ లాగే సిక్సర్లు..
ఐదారేళ్ల పిల్లలు సాధారణంగా ఇష్టమొచ్చిన ఆటలు ఆడతారు. కానీ ఏ ఆటలోనూ పట్టు ఉండదు. కానీ పాకిస్థాన్ కు చెందిన ఈ ఆరేళ్ల చిన్నారి మాత్రం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతోంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాదిరిగానే షాట్స్ బాదుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లీష్ క్రికెట్ ఎంపైర్ రిచార్డ్ కెటిల్ బారూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

పాకిస్థాన్ కు చెందిన ఆరేళ్ల సోనియా ఖాన్ ఇప్పుడు ఆ దేశంలో ట్రెండింగ్ గా మారింది. ఆమె క్రికెట్ స్కిల్స్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆరేళ్ల వయసులోనే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. రోహిత్ మాదిరిగానే పుల్ షాట్ కొట్టి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి సోనియాకు బంతులు వేస్తుండగా ఆమె ఒక్కో బంతిని ప్రొఫెషనల్ క్రికెటర్ మాదిరి బాధేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. 12 వేల లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లలో అనేక మంది నెటిజన్లు ఆమె బ్యాటింగ్ ను రోహిత్ శర్మ బ్యాటింగ్ లాగే ఉందని చెబుతున్నారు.
6 yrs old ~ Talented Sonia Khan from Pakistan 🇵🇰 (Plays Pull Shot like Rohit Sharma) 👏🏻 pic.twitter.com/Eu7WSOZh19
— Richard Kettleborough (@RichKettle07) March 19, 2025
టాలెంటెడ్ సోనియా తన పరిధిలో గ్లోరియస్ షాట్స్ కొడుతోందని.. బాల్స్ వేస్ట్ చేయడం లేదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. చిన్నారికి పాకిస్థాన్ జట్టులోకి తీసుకోవాలని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ వీడియో తనను ఆనందపరిచిందని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇది రియల్ టాలెంట్.. భవిష్యత్తులో ఆమె ఎన్నో విజయాలను చూస్తోందని మరో వ్యక్తి ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.












Click it and Unblock the Notifications