Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్ణ వివక్ష పోరాట యోధుడు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూత

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. టుటు కుటుంబసభ్యులతోపాటు దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

'ఈ ఉదయం కేప్ టౌన్ లోని ఒయాసిస్ ఫ్ట్రైల్ కేర్ సెంటర్‌లో టుటు తుది శ్వాస విడిచారు' అని ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియజేయలేదు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో మరొకరిని కోల్పోయామన్న అధ్యక్షుడు రామఫోసా.. టుటుతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

South Africa: Anti-apartheid Icon, Archbishop Desmond Tutu Passes Away Aged 90

జోహన్నెస్‌బర్గ్ కు మొదటి నల్లజాతి బిషప్‌గా, తర్వాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్‌గా ఆయన వ్యవహరించారు. 1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కొన్నేళ్లుగా ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

కాగా, దక్షిణాఫ్రికా నైతిక దిక్సుచిగా పేరుపొందారు డెస్మంటు టుటు. 1980ల్లో స్థానికంగా నల్ల జాతీయులపై క్రూరమైన అణిచివేత పాలనకు, జాతి వివక్షతకు వ్యతిరేకరంగా పోరాడిన ప్రముఖుల్లో టుటు ఒకరు. ఎల్జీబీటీల హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేశారు. ఆయన అహింసాయుత పోరాటానికి గుర్తింపుగా 1984లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+