దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఫ్యామిలీని బంధించి, దోపిడీ
దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్‌లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్‌లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.
భారత కాన్సల్ జనరల్‌గా శశాంక్ విక్రమ్.. డర్బన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శశాంక్ విక్రమ్ ఫ్యామిలీ, ఇద్దరు చిన్నారులు, సిబ్బంది, వీరి వద్దకు వచ్చిన ఓ టీచర్‌ను బంధించిన దుండగులు.. ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిసింది.

అయితే, బాధితులంతా బాగానే ఉన్నారని, కానీ కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పారు. దుండగులు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదని కాన్సల్ ఎస్కే పాండే తెలిపారు. శశాంక్ ఇంట్లోని ఓ సిబ్బందికి చెందిన ఫోన్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని, దాని ద్వారా నిందితులను పట్టుకోవచ్చని చెప్పారు.
ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. రాయబారులకు రక్షణ కల్పించడం దక్షిణాఫ్రికా బాధ్యత అని భారత్ గుర్తు చేసింది. కాగా, ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications