29 మందిపై అత్యాచారం: కామాంధుడికి 1,535 ఏళ్ల జైలు శిక్ష
జోహెన్నెస్‌బర్గ్: ఆ కామాంధుడికి దక్షిణాఫ్రికాలో వేయి ఏళ్లకు పైగా జైలు పడింది. ఆరేళ్ల పాటు 29 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన అల్బర్డ్ మొరాకె (35) అనే వ్యక్తికి జోహెన్నెస్‌బర్గ్ హైకోర్టు గురువారంనాడు 1,535 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
మొరాకెపై నమోదైన 175 కేసులు నమోదయ్యాయి. వీటిలో 30 అత్యాచారాల కేసులు, 41 కిడ్నాప్ కేసులు, 25 దోపిడీ కేసులతో సహా ఇంకా పలు కేసులున్నాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు ఒక్కో అత్యాచారానికి జీవిత ఖైదు, దోపిడీలన్నింటికీ కలిపి 360 ఏళ్లు, ఇతర కేసుల్లో విధించిన వందల ఏళ్ల జైలు శిక్షలన్నింటికీ కలిపి 1,535 ఏళ్ల కారాగారవాసాన్ని కోర్టు అతనికి ఖరారు చేసింది.

గాటెంగ్ ప్రావిన్స్‌లోని టెంబిసా ప్రాంతంలో మొరాకె 2007 - 2013 మధ్య ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. మొరాకె మహిళలను తుపాకి బెదిరించి నేరాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. కొన్నిసార్లు బాధితుల భాగస్వాములను కట్టేసి వారు చూసే విధంగా అతను అత్యాచారాలు చేసేవాడు. తాను చేసిన నేరాలకు అతను ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
పైగా అతను అహంకారపూరితంగా వ్యవహరించాడు. భవిష్యత్తులో అత్యాచారాల నుంచి ఎలా రక్షించుకోవాలో బాధితులకు సలహాలు కూడా ఇచ్చేవాడట. దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం కనీసం 25 ఏళ్లు జైలులో ఉంటే తప్ప అతనికి పెరోల్ కూడా లభించే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications