వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్టసభలో బీర్ బాటిల్‌తో ప్రవేశించిన సభ్యుడు: అదే ఆయన ఫైనల్ ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చట్టసభలను ప్రజాస్వామ్య దేవాలయాలుగా భావిస్తుంటారు రాజకీయ నేతలు. మెజారిటీ ప్రజల సంక్షేమానికి, వారికి భద్రత కల్పించడానికి, అభివృద్ధికి సంబంధించిన చట్టాలను చేసే పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. భారత్ ఒక్కటే కాదు.. ఏ దేశమైనా దీనికి అతీతం ఏమీ కాదు. అలాంటి పార్లమెంట్‌లోకి బీర్ టిన్‌తో ఎంట్రీ ఇచ్చాడో సభ్యుడు. తన చిట్టచివరి ప్రసంగం సందర్భంగా బీర్ టిన్‌ను ఓపెన్ చేశారు. ఫేర్‌వెల్ స్పీచ్ ఇచ్చారు. తనకు ఇదే చిట్టచివరి సమావేశం కాబోతోందని, ఇక ముందు అడుగు పెడతానో, లేదో తెలియదని పేర్కొన్నారు.

ఆయన పేరు జో కన్నింగ్‌హామ్. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు. దక్షిణ కరోలినాలోని ఫస్ట్ డిస్ట్రిక్ట్‌కు ఆయన పార్లమెంట్‌లో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీన ఆయన పార్లమెంట్ సభ్యత్వం ముగియబోతోంది. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన వారి సభ్యత్వం రెండేళ్ల పాటు ఉంటుంది. 2018లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కేటీ అర్రింగ్టన్‌ను ఓడించారు. వచ్చేనెల 3వ తేదీ నాటికి తన సభ్యత్వం ముగియబోతోండటంతో.. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో చిట్టచివరిసారిగా ప్రసంగించారు.

కిందటి నెల నిర్వహించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేసి, ఓడిపోయారు. రిపబ్లికన్ అభ్యర్థి న్యాన్సీ మేస్.. ఆయనపై ఘన విజయం సాధించారు. దీనితో కొత్త సభలో ఆయన అడుగు పెట్టే వీలు లేకుండా పోయింది. తన చివరి ప్రసంగం సందర్భంగా కన్నింగ్‌హామ్.. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ వంటి పరిస్థితులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభాావం చూపాయని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ల ప్రభుత్వ వైఫల్యాలు కూడా తోడయ్యాయని చెప్పారు.

 South Carolina Rep. Joe Cunningham cracks open beer during House speech

Recommended Video

Thirupati By-Election : తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బిజెపి జనసేన కూటమి అభ్యర్థి ఎవరు ?

జో బిడెన్ సారథ్యంలో ఏర్పడబోయే డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అమెరికన్ కాంగ్రెస్ తాను ఊహించినంత గొప్పగా ఏమీ లేదని అసంతృప్తినీ వ్యక్తం చేశారు. చర్చల్లో కాన్‌స్పిరసీ థియరీ అధికంగా ఉంటోందని వ్యాఖ్యానించారు. ప్రజానుకూలంగా కాకుండా..సొంత మనుషుల కోసం పని చేస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. తన రెండేళ్ల సభ్యత్వ కాలం త్వరలో ముగియబోతోన్నందున.. తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌తో వచ్చానని పేర్కొన్నారు. అనంతరం తన బ్లేజర్ వెనుక దాచిన బీర్ టిన్‌ను ఓపెన్ చేశారు. దాన్ని ఆయన తాగలేదు. టేబుల్‌పై ఉంచి, ప్రసంగాన్ని కొనసాగించారు.

English summary
South Carolina Rep. Joe Cunningham cracked open a beer on the House floor Thursday in an unusual stunt to encourage bipartisanship after he trashed colleagues as shameless partisans and liars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X