వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైకూన్ సూసైడ్ నోట్‌లో పేరు: రాజీనామా చేసిన కొరియా ప్రధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

సియోల్: ఓ వ్యక్తి తన ఆత్మహత్యకు ప్రధాని కారణం అని చెప్పడంతో, ఆ ప్రధాని రాజీనామా చేయడం, అతని రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించడం వెంటవెంటనే జరిగాయి. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ఓ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లీ వాన్ కూ రాజకీయ జీవితానికి అనూహ్యంగా ముగింపు పలికింది.

కొరియాలోని ఓ నిర్మాణ సంస్థ దివాళా తీసింది. అనంతరం, అవతకల పైన విచారణ జరుగుతోంది. దీంతో ఆ సంస్థ యజమాని సంగ్ వాన్ జంగ్ కోర్టు విచారణను ఎదుర్కొనవలసి వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను సూసైడ్ నోట్ రాశాడు.

South Korea’s prime minister resigns after his name appears on a tycoon’s suicide note

అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో వివరించాడు. తన ఆత్మహత్యకు ఎనిమిది మంది కారణమని చెప్పాడు. తన సంస్థ తరఫున ప్రధాని సహా ఎనిమిది మందికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చానని పేర్కొన్నాడు. 2013 ఎన్నికల సమయంలో ప్రచారం కోసం తాను లీ వాన్ కూకు 27వేల డాలర్లు ఇచ్చానని చెప్పారు.

ఇది దక్షిణ కొరియాలో సంచలనం రేపింది. ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రధాని లీ వాన్ కూ రాజీనామా చేశారు. దానిని అధ్యక్షులు ఆమోదించారు. తాను ఆ డబ్బులు తీసుకోలేదని లీ వాన్ కూ చెబుతున్నారు.

English summary
A suicide note has ended the political career of South Korea’s prime minister, Lee Wan Koo, in a widening scandal that is making a mockery of the government’s supposed crackdown on corruption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X