చిక్కుల్లో శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స-మే 9 హింసపై ప్రశ్నిస్తున్న సీఐడీ
శ్రీలంకలో ఆర్దిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభంగా మారిన నేపథ్యంలో మే 9న దేశవ్యాప్తంగా హింస చోటు చేసుకుంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీగా హింసకు పాల్పడ్డారు. రాజకీయనేతలు, వారి ఇళ్లపై విచ్చలవిడిగా దాడులు చేశారు. దీంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టంకూడా చోటు చేసుకుంది. దీనిపై ఇప్పుడు అధికారం చేపట్టిన విక్రమసింఘే సర్కార్ దృష్టిసారించింది.
మే 9న దాడులకు బాధ్యుడిగా భావిస్తున్న మాజీ ప్రధాని మహీంద రాజపక్సపై సీఐడీ విచారణ ప్రారంభించింది. తన ప్రభుత్వంపై ఆగ్రహంతో నిరసనలకు దిగుతున్నవారిపై దాడులు చేసేందుకు జైళ్లలో ఖైదీల్ని విడిచిపెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహీందపై విచారణ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. కొలంబోలోని ఆయన నివాసంలో నిన్న సాయంత్రం మాజీ ప్రధాని నుంచి దాదాపు మూడు గంటలపాటు వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసిందని పోలీసులు తెలిపారు.

మే 9న జరిగిన దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. రాజపక్స మద్దతుదారులకు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలపై శ్రీలంక పోలీసులు మాజీ ప్రధాని మహింద రాజపక్సను ప్రశ్నించారు.
3 గంటల సుదీర్ఘ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మే 9న, శ్రీలంకలో 76 ఏళ్ల మాజీ ప్రధాని మద్దతుదారులు ప్రధాన ఆహారం, ఇంధనం,విద్యుత్ కొరతకు దారితీసిన ఆర్థిక సంక్షోభంపై రాజపక్సను తొలగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడి చేయడంతో హింస చెలరేగింది.












Click it and Unblock the Notifications