వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింసాత్మక దాడులకు పాల్పడితే కాల్చి పారేయండి: ఆర్మీ, పోలీసులకు శ్రీలంక డెఫెన్స్ మినిస్ట్రీ

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలో రాజకీయ ప్రముఖులతోపాటు పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరులకు హాని కలిగించడం వంటి చర్యలకు పాల్పడినవారిపై కాల్పులు జరపాలని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ తన సాయుధ దళాలను, పోలీసులను ఆదేశించింది,

అంతకుముందు, మంగళవారం శ్రీలంకలోని ట్రింకోమలీ నేవల్ బేస్ ముందు ప్రాణాంతక నిరసనలు ప్రారంభమయ్యాయి. మహింద, అతని కుటుంబం మొత్తం నేవీ ట్రింకోమలీ నావికా స్థావరంలో భారీ సైనిక భద్రత మధ్య తలదాచుకున్నారని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

"మేము వెళ్లిపోతామని చాలా పుకార్లు ఉన్నాయి, మేము దేశం విడిచి వెళ్ళము," అని రాజపక్స తెలిపారు. తన కుటుంబంపై జాతీయ కోపం పెరగడాన్ని "చెడు ప్యాచ్"గా అభివర్ణించారు.
"నా తండ్రి క్షేమంగా ఉన్నారు, అతను సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాడు. అతను కుటుంబంతో కమ్యూనికేట్ చేస్తున్నాడు" అని దేశ క్రీడా మంత్రిగా పనిచేసిన నమల్ తెలిపారు.

ఆందోళనకారులను తొలగించేందుకు ప్రధాని నివాసం లోపల నుంచి భద్రతా సిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం, శ్రీలంక సైన్యం, భారీ ఆయుధాలతో ఆయుధాలతో, ఏదో విధంగా మహింద రాజపక్సేను అతని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. సోమవారం ఉదయం ద్వీప దేశ ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని నౌకాదళ స్థావరం అయిన ట్రింకోమలీకి హెలికాప్టర్ సహాయంతో రాజపక్సను తీసుకెళ్లారు. మరోవైపు, ఇప్పుడు ఆందోళనకారులు రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న నావికా స్థావరానికి కూడా చేరుకున్నారు.

Sri Lanka crisis: Those Damaging Property, Causing Harm To Others Can Be Shot, Warns Defence Ministry

శ్రీలంక రాజపక్సే ప్రభుత్వం వేలాది మంది సైనికులను, పోలీసులను మోహరించి కర్ఫ్యూ విధించింది. మహింద రాజపక్స రాజీనామా తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 200 మంది గాయపడగా, ఐదుగురు మరణించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా ఉన్నారు.

1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.. ఈ దేశం ఎన్నడూ లేనంత అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాగా, తమ దేశంలో నెలకొన్న సంక్షోభానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని శ్రీలంక ప్రజలను కోరుతున్నారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.

English summary
Sri Lanka crisis: Those Damaging Property, Causing Harm To Others Can Be Shot, Warns Defence Ministry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X