వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతున్న శ్రీలంక: ప్రధాని నివాసంపై దండయాత్ర: భద్రత బలగాలతో యుద్ధం: ఎమర్జెన్సీ విధింపు

|
Google Oneindia TeluguNews

కొలంబో: రాజకీయ, ఆర్థికంగా పెను సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అట్టుడుకుతోంది. మరోసారి ఆందోళనలకు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు మళ్లీ రోడ్డెక్కారు. ఈ సారి వారి లక్ష్యం.. ప్రధానమంత్రి నివాసం. వేలాదిమంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె తక్షణమే తన పదవులన్నింటికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పారిపోయిన అధ్యక్షుడు..

పారిపోయిన అధ్యక్షుడు..


అంతకుముందే అధ్యక్షుడు గొటబయ రాజపక్స తాజాగా దేశం విడిచి పారిపోయారు. ఈ నెల 9వ తేదీన తన నివాసం నుంచి పారిపోయిన ఆయన ఇన్ని రోజులు నౌకాదళాధికారుల ఆశ్రయంలో గడిపారు. నౌకాదళానికి చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్‌లో తలదాచుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన దేశం విడిచి పారిపోయారు. మాల్దీవులకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున 3 గంటలకు గొటబయ..మాల్దీవుల రాజధాని మాలీలో ల్యాండ్ అయ్యారు.

కీలక పరిణామాలతో..


మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆంటొనొవ్-32లో ఆయన దేశం దాటారు. భార్య, వ్యక్తిగత భద్రత సిబ్బంది, మరో నలుగురు మాత్రమే ఉన్నట్టు శ్రీలంక మీడియా పేర్కొంది. గొటబయ దేశం విడిచి పారిపోయిన విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది. శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. గొటబయ తమ దేశంలో లేరని పేర్కొంటూ ప్రధానమంత్రి కార్యాలయం మీడియా డివిజన్ స్పష్టం చేసింది.

ప్రధాని లక్ష్యంగా..


ఈ పరిణామం అనంతరం ఇక తాజాగా ఆందోళనకారులు రణిల్ విక్రమసింఘె లక్ష్యంగా తమ ప్రదర్శనలను చేపట్టారు. దీనికి కారణం లేకపోలేదు. అధ్యక్షుడు రాజీనామా చేసిన తరువాత ఆటోమేటిక్‌గా ప్రధానమంత్రి ఆ స్థానానికి ఎన్నిక అవుతారు. గొటబయ రాజపక్స లేకపోవడం వల్ల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె అపాయింట్ అయ్యారు. అదే ఇప్పుడు ఆందోళనకారుల ఆగ్రహానికి కారణమైంది. రణిల్ కూడా తన అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేస్తోన్నారు.

యుద్ధ వాతావరణం..

యుద్ధ వాతావరణం..

కొలంబోలోని విక్రమసింఘె నివాసానికి వేలాదిమంది ఆందోళనకారులు ప్రదర్శనగా చేరుకోగా.. భద్రత బలగాలు వారిని అడ్డుకున్నాయి. లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. దీనితో ఆందోళనకారులు భద్రత బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వారిని అడ్డుకోవడానికి భధ్రత బలగాల భాష్పాయువు గోళాలను ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహించారు. దీనితో అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

 ఎమర్జెన్సీ..

ఎమర్జెన్సీ..

ఒక్క కొలంబో మాత్రమే కాకుండా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే ఉద్రిక్తత కనిపించింది. అంతకంతకూ పరిస్థితులు చేయి దాటుతోండటంతో రణిల్ విక్రమసింఘె యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలకు దిగారు. ఎమర్జెన్సీని ప్రకటించారు. దేశ పశ్చిమ ప్రావిన్స్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆందోళనల తీవ్రత ఇక్కడే అధికంగా ఉంటోంది. కాగా- ఇంకాస్సేపట్లో శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

English summary
Sri Lanka declares emergency as protest erupt outside PM's residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X