వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద బీభత్సం: 90 మందికి పైగా మృతి, విరిగిపడ్డ కొండచరియలు

శ్రీలంకలో వరద బీభత్సం సృష్టించింది. వరదల కారణంగా 90 మందికి పైగా మృతి చెందారు. మరో వందల మంది గల్లంతయ్యారు. శుక్రవారం నుంచి వర్షం జోరుగా కురుస్తోంది. దీంతో వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి.

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో వరద బీభత్సం సృష్టించింది. వరదల కారణంగా 90 మందికి పైగా మృతి చెందారు. మరో వందల మంది గల్లంతయ్యారు. శుక్రవారం నుంచి వర్షం జోరుగా కురుస్తోంది. దీంతో వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి.

దక్షిణ, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20వేల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిలటరీ బోట్లు, హెలీ కాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు.

కొండ చరియలు కింద చిక్కుకున్న వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు శ్రీలంక విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించింది.

sri lanka

తమ దేశానికి సహకరించాల్సిందిగా ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం ఐక్య రాజ్య సమితి సహా సరిహద్దు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. ఈ వరదలతో పెను ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది.

ఈ వరదలు 60 వేల మందిపై ప్రభావం చూపాయని అధికారులు చెప్పారు. ప్రభుత్వం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

English summary
Sri Lanka is calling for international assistance after more than 90 people died in flood waters caused by heavy rain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X