శ్రీలంక సంక్షోభంలో ట్విస్ట్- విపక్షాల్ని కేబినెట్ లో చేరాలని అధ్యక్షుడి పిలుపు-ఉమ్మడి పోరుకు రెడీ
శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ప్రజా నిరసనలతో తన నివాసానికి సెగ తగలడంతో అధ్యక్షుడు గోటబాట రాజపక్స ఎమర్జెన్సీవిధించారు. కర్ఫ్యూ కూడా పెట్టారు. అయినా పరిస్ధితి సద్దుమణగడం లేదు.ఈ లోపే సంక్షోభానికి బాధ్యత వహిస్తూ కేబినెట్ మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో కొత్త కేబినెట్ కొలువు తీరాల్సి ఉంది.
శ్రీలంకలో త్వరలో ఏర్పాటయ్యే కొత్త మంత్రివర్గంలో చేరాలంటూ అన్ని పార్టీలకు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు వీలుగా విపక్షాలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటూ ఆయన కోరారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పార్లమెంట్‌లోని అన్ని పార్టీలను మంత్రి పదవులను అంగీకరించాలని , శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికి తనతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. అనేక ఆర్థిక కారకాలు, ప్రపంచ పరిణామాలు సంక్షోభానికి కారణమని, ప్రజాస్వామ్య చట్రంలో వీటికి పరిష్కారాలను కోరుతున్నట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

శ్రీలంక క్యాబినెట్ మూకుమ్మడి రాజీనామాలు చేసిన ఒక రోజు తర్వాత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ వారాంతంలో కర్ఫ్యూను కూడా ధిక్కరిస్తూ, అధ్యక్షుడు, ఆయన ప్రభుత్వాన్ని వైదొలగాలని కోరుతూ అనేకమంది పౌరులు నిరంతరాయంగా నిరసనలు చేస్తున్నారు. ముగ్గురు రాజపక్సేలతో సహా క్యాబినెట్‌లోని మంత్రులందరూ ఆదివారం రాత్రి రాజీనామా చేయగా, అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే, ప్రధాని మహింద రాజపక్స కార్యాలయంలోనే ఉన్నారు.
ఇది జాతీయ అవసరంగా భావించి, పౌరులందరి, భవిష్యత్తు తరాల కోసం కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని అధ్యక్షుడు గోటబాయ తెలిపారు. ఈ జాతీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికి మంత్రుల శాఖలను స్వీకరించడానికి కలిసి రావాలని పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్రపతి ఆహ్వానిస్తున్నారుని రాష్ట్రపతి మీడియా విభాగం ఇవాళ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications