శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్య
శ్రీలంక: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన సోదరుడు ప్రియాంత శిరిసేన అలియాస్ వేలి రాజు (42) దారుణ హత్యకు గురైనాడు. ప్రియాంత శిరిసేనను ఆయన స్నేహితుడే హత్య చేశాడని పోలీసు అధికారి రువాన్ జ్ఞానశేఖర్ అంటున్నారు. అనుమానితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోలంబో పోలీసు అధికారులు తెలిపారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన చివరి తమ్ముడు ప్రియాత శిరిసేన. శ్రీలంక రాజధాని కోలంబోకు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలోన్నారువ అనే నగరంలో ప్రియాంత శిరిసేన నివాసం ఉంటున్నారు. అదే ఆయన సొంత ప్రాంతం.
ప్రియాంత శిరిసేన వ్యాపారవేత్త. గురువారం రాత్రి ప్రియాంత వ్యాపార నిమిత్తం సొంత నగరం అయిన పాలోన్నారువలో పర్యటించారు. తరువాత కారు దిగి వెళుతున్న సమయంలో ఒకతను గొడ్డలి తీసుకుని వచ్చి ప్రియాంత మీద దాడి చేశాడు. ఆయన తలకు తీవ్రగాయాలైనాయి.

వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తరువాత అదే రోజు రాత్రి ప్రియాంతను కోలంబోకు తరలించారు. కోలంబోలోని ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతూ ప్రియాంత శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తలకు తీవ్రగాయాలు అయ్యాయని, మెరుగైన చికిత్స చేసినా ప్రియాంత కొలుకోలేదని వైద్యులు అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన చైనా పర్యటనలో ఉన్నారు. శనివారం ఆయన శ్రీలంక చేరుకుంటారు. తరువాత ప్రియాంత అంత్యక్రియలు జరుగుతాయని పోలీసు అధికారి రువాన్ జ్ఞానశేఖర్ తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications