Prabakaran alive : ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారా ? అనుచరుడి ప్రకటన..!

శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం దశాబ్దాల పాటు పోరాడి సింహళ ఆర్మీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారని ఆయన అనుచరుడొకరు సంచలన ప్రకటన చేశారు.

90వ దశకంలో శ్రీలంకలో మెజారిటీ సింహళీయులకూ, మైనార్టీ తమిళులకు మధ్య భీకర పోరాటమే సాగింది. అప్పట్లో బలం, బలగం తక్కువగానే ఉన్నా విదేశాల నుంచి అందిన సాయంతో సింహళీయులకు చుక్కలు చూపించిన ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఆ తర్వాత ఆర్మీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఆయన శవం ఫొటో కూడా విడుదల చేసింది. దీంతో లంకలో తమిళ పోరు ముగిసినట్లయింది.అయితే వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నట్లు ఇవాళ ఆయన అనుచరుడు సంచలన ప్రకటన చేశారు.

ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగానే ఉన్నారని, క్షేమంగా ఉన్నారని ప్రపంచ తమిళుల సమాఖ్య అధ్యక్షుడు పీ నెడుమారన్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఆయన త్వరలో బయటకు వచ్చి ఈలం తమిళులకు మెరుగైన జీవితం కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని వెల్లడించారు.

Sri lankan LTTE Chief Velupillai Prabakaran is still alive ?

తంజావూరు నెడుమారన్‌లోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు, శ్రీలంకలో రాజపక్సే పాలనను ధ్వంసం చేసిన సింహళీయుల శక్తివంతమైన తిరుగుబాటు నేత ప్రభాకరన్ బయటకు రావడానికి ఇదే సరైన తరుణమని నెడుమారన్ పేర్కొన్నారు.

అంతే కాదు వేలుపిళ్లై ప్రభాకరన్ కు అండగా నిలవాలని తమిళనాడు ప్రభుత్వానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు, ప్రజలకు నెడుమారన్ పిలుపునిచ్చారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారని, ఆయన యోగక్షేమాలు తెలియజేసినట్లు వెల్లడించారు. అలాగే ఆయన సమ్మతితోనే ప్రభాకరన్ బయటకు వచ్చే ప్రతిపాదనను తాను ప్రకటిస్తున్నట్లు కూడా నెడుమారన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకరన్ ఆచూకీ, ఆయన బయటకు వచ్చే సమయం గురించి ఇతరులలాగే తాను కూడా ఆసక్తిగా ఉన్నానని నెడుమారన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+