వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగమ్మాయి శ్రీశుభకు ‘మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గ్వాటెంగ్’ కిరీటం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి, అందాల సుందరి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను ‘మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గాటెంగ్‌’ కిరీటాన్ని గెలుచుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

జొహాన్నెస్‌బర్గ్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి, అందాల సుందరి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను 'మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గ్వాటెంగ్' కిరీటాన్ని గెలుచుకున్నారు.

ఇక్కడి ఓ ప్రముఖ బ్యాంకులో ఆమె 14 నెలల ఒప్పంద ఉద్యోగినిగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐటీ నిపుణురాలైన శ్రీశుభ...తన స్నేహితుల ప్రోత్సాహంతో ఈ పోటీలో నిలిచారు.

ఎనిమిది మంది స్థానిక సుందరీమణులు ఆమెకు గట్టిపోటీ నిచ్చారు. పోటీ సందర్భంగా ఇతర విభాగాల్లోనూ ఆమె చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ పోటీ సందర్భంగా శ్రీశుభ ఓ నృత్యప్రదర్శన ఇచ్చారు.

Srisubha Addepalli wins Miss India South Africa Gauteng title

కేవలం మూడు నిముషాల వ్యవధిలో తన జీవితానికి సంబంధించిన మూడు కీలక దశలను తన నాట్యంతో అద్భుతంగా ఆవిష్కరించారామె. సున్నితభావజాలం, మృదు వర్తన ఉన్న కుటుంబ నేపథ్యం తనదని ఆమె చెప్పారు. తన నాట్యంలోని తొలిదశలో ఆ కోమలనేపథ్యాన్ని ప్రదర్శించానన్నారు.

తర్వాత తండ్రి మరణం వంటి వ్యధాభరిత పరిణామాలతో కుంగదీసిన అనుభవాలను ప్రతిబింబింపచేశారు. మూడో దశలో 'నేనెవరు' అనే తన ఆంతరంగిక అన్వేషణను నాట్యంలో ప్రతిఫలింపచేసినట్లు తెలిపారు. ‌

శ్రీశుభ ప్రదర్శించిన ఈ నాట్యం న్యాయనిర్ణేతల ప్రశంసలను అందుకుంది. ఇరవైఏడేళ్ల క్రితం 'మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా పోటీ'ని ప్రారంభించిన ఫరూక్‌ ఖాన్‌ మాట్లాడుతూ... ఈ కిరీటాన్ని గెలుచుకున్న రెండో భారతీయ యువతి శ్రీశుభ అని తెలిపారు.

English summary
Srisubha Addepalli, an IT specialist hailing from Andhra Pradesh, was crowned Miss India South Africa Gauteng 2017. The 25-year-old has been working for a leading bank here on contract basis for 18 months. Apart from fairing the best in other segments of the contest, Addepalli also performed a dance number, which was well-received by the jury. "Dance is my passion and because we were only allowed a maximum of three minutes, I chose three segments to represent different parts of my life. I was born and brought up in a family where all the emotions are very smooth and gentle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X