పుతిన్‌పై నిప్పులు చెరిగిన బైడెన్: నర హంతక నియంత..ఇంకా ఇంకా

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య 23 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని నిలిపి వేయాలంటూ అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను రష్యా లెక్క చేయట్లేదు. తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే- సరిహద్దులకు ఆనుకుని ఉన్న కీలక పట్టాలపై రష్యా పట్టు బిగించింది. మరియోపోల్, ఖేర్సన్, ఖార్కీవ్, చెర్న్‌హీవ్, వొల్నోవాఖా, ఒడెస్సా.. వంటి పలు నగరాలను స్వాధీనం చేసుకుంది.

 లెక్క చేయని పుతిన్..

లెక్క చేయని పుతిన్..

అంతర్జాతీయంగా తనపై వస్తోన్న ఒత్తిళ్లను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం లెక్క చేయట్లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఏకమైనప్పటికీ.. వెనకడుగు వేయట్లేదు. తమ డిమాండ్లను అంగీకరించితే తప్ప యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు. అత్యున్నత వేదిక ఐక్యరాజ్య సమితి చేసిన సూచనలను కూడా రష్యా పట్టించుకోవట్లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం రష్యాకు వ్యతిరేకంగా ఆదేశాలను జారీ చేసింది. వీటినేవీ పరిగణనలోకి తీసుకోవట్లేదు.

పుతిన్‌పై బైడెన్ ఫైర్..

పుతిన్‌పై బైడెన్ ఫైర్..

రష్యా ఎంతకూ లొంగకపోవడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. పుతిన్‌పై మాటల యుద్ధానికి దిగారు. ఆయనను నర హంతక నియంతగా అభివర్ణించారు. పుతిన్.. అనైతిక యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉక్రెయిన్ ప్రజలతో తన రక్త దాహాన్ని తీర్చుకుంటున్నాడంటూ మండిపడ్డారు. సెయింట్ ప్యాట్రిక్స్ దినోత్సవం సందర్భంగా క్యాపిటల్ హిల్ నుంచి బైడెన్ ప్రసంగించారు. ఐర్లాండ్ ప్రధాని మైఖెల్ మార్టిన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారుం.

ఉక్రెయిన్ ప్రజలను హత్య చేస్తున్నారంటూ

ఉక్రెయిన్ ప్రజలను హత్య చేస్తున్నారంటూ

పుతిన్, ఆయన సైనికులు ఉక్రెయిన్ ప్రజలను అమానుషంగా చంపుతున్నారని బైడెన్ విమర్శించారు. అత్యంత నిరంకుశాధికారిగా ఆరోపించారు. అతి క్రూరంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రెండు రోజుల కిందటే- జో బైడెన్.. తన రష్యన్ కౌంటర్‌పార్ట్‌పై మాటలదాడి ఆరంభించిన విషయం తెలిసిందే. పుతిన్‌ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. పుతిన్ చేసిన వ్యాఖ్యలను రష్యా తప్పు పట్టింది.. అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన చేసిన విమర్శలు బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది.

రష్యా దూకుడును అడ్డుకోవడానికి..

రష్యా దూకుడును అడ్డుకోవడానికి..

రష్యా దూకుడును, పుతిన్ యుద్ధోన్మాదాన్ని అడ్డుకోవడానికి అన్ని దేశాలు ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని జో బైడెన్ అన్నారు. ఈ విషయంలో ఐర్లాండ్ తమకు మద్దతు ఇవ్వడం సంతోషకరమని బైడెన్ చెప్పారు. మైఖెల్ మార్టిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాను నిలువరించే విషయంలో యూరోపియన యూనియన్ దేశాలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని బైడెన్ భరోసా ఇచ్చారు. తన యుద్ధోన్మాదానికి పుతిన్.. తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

 24న బెల్జియం పర్యటన

24న బెల్జియం పర్యటన

ఈ నెల 24వ తేదీన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పాటు కానున్న నాటో అత్యున్నత స్థాయి సదస్సుకు బైడెన్ హాజరు కానున్నారు. అలాగే- యూరోపియన్ యూనియన్ నేతలతో ముఖాముఖి భేటీ కానున్నారు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల సమావేశంలో బైడెన్ పాల్గొననున్నారు. బైడెన్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ పిసాకీ తెలిపారు. నాటో నిర్వహించబోయే అసాధారణ సదస్సుగా దీన్ని ఆమె అభివర్ణించారు.

ఈయూ సమ్మిట్‌లో..

ఈయూ సమ్మిట్‌లో..

యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు నిర్వహించే సదస్సులోనూ బైడెన్ పాల్గొంటారని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు సదస్సులు- అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నామని పిసాకీ వ్యాఖ్యానించారు. రష్యాపై విధించాల్సిన మరిన్ని ఆంక్షలు, యుద్ధంలో నష్టపోతున్న ప్రజలకు మానవతా దృక్పథం కింద అందించాల్సిన సహాయ, సహకారాలు, ఉక్రెయిన్ భవిష్యత్ గురించి ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+