వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆపిల్ కంపెనీ ప్రస్తుతం సీఈఓ టిమ్ కుక్ తాను స్వలింగ సంపర్కుడనని వెల్లడించిన నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్‌లో చోటు చేసుకుంది.

ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. రష్యాలో స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ సంస్ధ ప్రచారం నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తాను గేనని అనడంతో స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్లు ఆ సంస్ధ తెలిపింది.

Steve Jobs Memorial in Russia Dismantled After Tim Cook Comes Out as Gay

ఇటీవల బ్లూమ్బర్గ్ బిజినెస్‌వీక్‌లో రాసిన ఓ కథనంలో తాను గే నని బహిరంగంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇతరులు సెక్స్ ఓరియెంటేషన్ తెలపడంలో తన మద్ధతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను గే గా జీవించడం దేవుడిచ్చిన వరం అన్నారు.

బహిరంగంగా తాను గే నని ప్రకటించిన అమెరికన్ కంపెనీ సిఈవోల్లో టిమ్ కుక్ మూడవ వారు. గే నని ప్రకటించినందుకు టిమ్‌కుక్‌కు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతుంది.

English summary
A memorial dedicated to the late Apple founder Steve Jobs, who lost his battle with cancer in 2011, has been torn down in Russia after the company’s current CEO Tim Cook revealed that he is gay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X