ట్రంప్‌తో కొన్నేళ్లపాటు ‘ఆ’ బంధం, నోరు తెరిస్తే చంపేస్తామన్నారు: పోర్న్‌స్టార్ సంచలనం

వాషింగ్టన్: అయిపోయింది.. అమెరికా అధ్యక్షుడి పరువంతా పోయింది. ఇన్నాళ్లూ తన రాసలీలలకు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన వాటిని కొట్టిపారేస్తూ వచ్చేవారు. శ్వేతసౌధం అధికారులు కూడా అవన్నీ బోగస్ అంటూ ఒక్కమాటతో వదిలించుకునేవాళ్లు. కానీ అధ్యక్షులవారు ఎంత గింజుకున్నా పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ చేతిలోంచి మాత్రం బయటపడలేకపోతున్నారు.

అవును, అమెరికాలో ఇప్పుడు హాట్ న్యూస్ ఏమిటంటే.. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ పోర్న్‌ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ అలియాస్ స్టార్మీ డేనియల్స్ ఇష్యూయే. గత కొన్ని నెలలుగా ట్రంప్‌ను ఇబ్బందిపెడుతున్న ఈ పోర్న్ స్టార్ తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించింది.

2006లోనే మొదలైన బంధం...

2006లోనే మొదలైన బంధం...

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తెలిపిన వివరాల ప్రకారం... ట్రంప్‌తో ఆమె లైంగిక సంబంధం ఏళ్లనాటిది. అవును, 2006లోనే వీరిద్దరి బంధం మొదలైందట. ఆ ఏడాది జులైలో లేక్ తాహులోని సెలబ్రిటీ గోల్ఫ్ క్లబ్‌లో స్టార్మీ డేనియల్‌ని చూసిన ట్రంప్ ఆమెపట్ల ఆకర్షితుడయ్యాడట. అంతే - వెంటనే ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించాడట. దీంతో ట్రంప్‌ హోటల్‌‌లోని సూట్‌‌కు డేనియల్స్ వెళ్లిందట. ఆదివారం సీబీఎస్ చానెల్‌లో ‘60 మినిట్స్' కార్యక్రమంలో స్టార్మీ డేనియల్స్ డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న ‘ఆ' బంధం గురించి పలు విషయాలు వెల్లడించింది.

ట్రంప్‌తో హోటల్ సూట్‌లో...

ట్రంప్‌తో హోటల్ సూట్‌లో...

తాను డొనాల్డ్ ట్రంప్‌ ఆహ్వానం మేరకు ఆయన హోటల్లోని ఓ సూట్‌లో కలిశానని, తాను రావడం ఎంతో ఆనందం కలిగించినట్లు ట్రంప్ తనతో చెప్పారని 39 ఏళ్ల పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ పేర్కొంది. ఆ సమయంలో ట్రంప్ తన గురించి చెప్పుకోవడం మొదలెట్టారని, ‘నా కొత్త మ్యాగజైన్ చూశావా?' అని ట్రంప్ ఆమెను అడిగారట. అప్పడు యథాలాపంగా ఆయన చేతిలోని మ్యాగజైన్‌ను డేనియల్స్ చూసిందట. ఆ మ్యాగజైన్ ముఖచిత్రంపై ట్రంప్ ఫొటో ఉందట. మీకు ఈ అభిరుచి కూడా ఉందా? అంటూ తాను ప్రశ్నించానని, అంతేకాకుండా ఎవరైనా మీ మ్యాగజైన్‌తో మీ మర్మాంగంపై కొడితే ఎలా ఉంటుందంటూ తాను ట్రంప్‌ను కవ్వించానని ఆమె తెలిపింది.

నిజంగానే కొట్టించుకున్న ట్రంప్...

నిజంగానే కొట్టించుకున్న ట్రంప్...

తాను ట్రంప్‌తో ఆ మాట అనగానే ఆయన మొహంలో ఏదో తెలియని ఉత్సాహం తనకు గోచరించిందని, అప్పడు తాను ఆ మ్యాగజైన్‌ను తన చేతిలోకి తీసుకుని ప్యాంటు విప్పమని సూచించానని, ట్రంప్ అలాగే చేశారని, దాంతో తాను ఆయన ముఖచిత్రం ఉన్న మ్యాగజైన్‌తో ఆయన మర్మాంగంపై కొన్ని దెబ్బలు కొట్టానంటూ చెప్పి నవ్వేసింది పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ తనతో మరింత చనువుగా ఉండటం మొదలుపెట్టారని పేర్కొంది. ‘వావ్.. నువ్వు చాలా అందంగా, స్మార్ట్‌గా ఉన్నావు.. నిన్ను చూస్తుంటే నా కూతురు గుర్తొస్తోంది.. నువ్వు నాకు చాలా నచ్చావు..' అంటూ పలుమార్లు మాటల సందర్భంగా ట్రంప్ తనతో అన్నారంటూ డేనియల్స్ చెప్పింది.

సేఫ్టీ లేకుండానే సెక్స్‌లో...

సేఫ్టీ లేకుండానే సెక్స్‌లో...

తనతో ట్రంప్ మాటల సందర్భంగా ఆయన మూడో భార్య మెలానియా గురించి, ఆమె బిడ్డకు జన్మనివ్వడం గురించిన ప్రస్తావన కూడా వచ్చిందని, ఆ తరువాత తాము బయటికి వెళ్లకుండా హోటల్ గదిలోనే డిన్నర్ ముగించామని, అనంతరం తాను రెస్ట్ రూమ్‌కు వెళ్లాలని చెబితే ట్రంప్ స్వయంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లారని, తాను రెస్ట్ రూమ్‌లోంచి తిరిగి బయటికొచ్చేసరికి ఆయన బెడ్‌పై ఓ చివర కూర్చుని తననే చూడసాగారని స్టార్మీ డేనియల్స్ ఆనాటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ వివరించింది. ఆ తరువాత అదే బెడ్‌పై తాము లైంగికంగా కలిశామని, ఆ సమయంలో ట్రంప్ సేఫ్టీ గురించి ఆలోచించలేదని, కండోమ్ కూడా వాడలేదని ఆమె పేర్కొంది.

 ఆ బంధం అలా కొన్నేళ్లపాటు...

ఆ బంధం అలా కొన్నేళ్లపాటు...

డొనాల్డ్ ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్ సమయంలో పోర్న్ ‌స్టార్ స్టార్మీ డేనియల్స్ వయసు 29 సంవత్సరాలట. మరి ట్రంప్ వయసేమో అప్పటికే 60 ఏళ్లు. తనకు ట్రంప్‌పై పెద్దగా ఆకర్షణ కలగలేదుగానీ, అనుకోకుండానే తాను ఆయనతో సెక్స్‌లో పాల్గొన్నానని, ఇందుకు తానేమీ బాధపడడం లేదని, తానేమీ బాధితురాలిని కానని పోర్న్ స్టార్ డేనియల్స్ చెప్పింది. తనతో శృంగారంలో పాల్గొన్న అనంతరం ట్రంప్ ముఖంలో అమితానందం కనిపించిందని, దానిని బట్టి ఆయనకు తనపై ఎంతటి ఆకర్షణ ఉందో తనకు అర్థమైందని, ఆ తరువాత నుంచి తమ సంబంధం కొన్నేళ్లపాటు నిరాటంకంగా కొనసాగిందని, ట్రంప్‌తో తాను ఎన్నోమార్లు సెక్స్‌లో పాల్గొన్నానని పేర్కొంది.

బెదిరించిన ట్రంప్ మనుషులు...

బెదిరించిన ట్రంప్ మనుషులు...

2011 తరువాత డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు మొదలయ్యాయని, ట్రంప్ మనుషులు తనను కలిసి బెదిరంచే ప్రయత్నాలు కూడా చేశారని, అప్పటినుంచి తాను ట్రంప్‌ను కలవలేదని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తెలిపింది. మళ్లీ 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయన తరపున ఓ లాయర్ తనను కలిశాడని, డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న అన్నిరకాల సంబంధాల గురించి మీడియా ముందు ఎన్నడూ నోరు విప్పకూడదంటూ తనకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడని, చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని కూడా బెదిరించారని పేర్కొంది.

డేనియల్స్ ఇంటర్వ్యూ మిస్సైన ట్రంప్...

డేనియల్స్ ఇంటర్వ్యూ మిస్సైన ట్రంప్...

ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న అన్ని రకాల సంబంధాలను ఓ టీవీ చానెల్ ఇంటర్యూలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ బయటపెట్టి రచ్చ రచ్చ చేయగా.. పాపం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఇదంతా చూడనేలేదు. ఆ సమయంలో ట్రంప్ తన భార్యతో కలిసి అక్కడికి 1609 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్నారని, వేసవి విడిదిలో భాగంగా వారం రోజులుగా అక్కడి మార్ ఏలాగో ఎస్టేట్‌లో ఆయన విడిది చేశారని శ్వేతసౌధం పేర్కొంది.

 అధ్యక్షుడిగా ఆయన అనర్హుడు, అందుకే...

అధ్యక్షుడిగా ఆయన అనర్హుడు, అందుకే...

డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడిగా అనర్హుడని తాను బలంగా నమ్ముతున్నానని, తనకు జరిగిన అన్యాయాన్ని, ట్రంప్ నిజస్వరూపాన్ని అమెరికా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ టీవీ ఇంటర్వ్యూ ద్వారా ప్రయత్నిస్తున్నానని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ తెలిపింది. తాను చెప్పినవన్నీ నిజాలని, ఆ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా బాగా తెలుసని ఆమె పేర్కొంది. అంతేకాదు, టీవీ చానెల్‌లో 60 నిమిషాలపాటు ఆమె ఇంటర్వ్యూ ప్రసారం అయిన తరువాత ట్రంప్ పర్సనల్ లాయర్ నుంచి ఓ హెచ్చరిక ఉత్తరం కూడా పంపారట. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+