షాకింగ్: ట్రంప్‌‌ను కోర్టుకీడ్చిన పోర్న్‌స్టార్, ఒక్కసారే సెక్స్‌లో, లాయర్ ఒత్తిడి!

లాస్‌ఏంజిల్స్: అనుకున్నంతా అయ్యింది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు బజారున పడింది. ఆయనపై పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ అలియాస్ స్టార్మీ డేనియల్స్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్‌డిస్‌క్లోజర్‌) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది.

లాస్‌ఏంజెల్స్‌ కోర్టులో బుధవారం ఈ మేరకు దావా దాఖలు చేసిన పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్.. నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున అది చెల్లుబాటుకాదంటూ వాదించింది. తాను ట్రంప్‌తో ఒక్కసారి మాత్రమే సెక్స్‌లో పాల్గొన్నానని, ఆ తరువాత ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య మళ్లీ ఎన్నడూ శారీరక సంబంధం చోటుచేసుకోలేదని ఆమె పేర్కొంది.

Stormy Daniels Files Suit, Claiming Trump Never Signed ‘Hush Agreement’

అయితే ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ మాత్రం వారిద్దరి నడుమ నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందం జరిగిందని.. ఆ ఒప్పందం ప్రకారమే పోర్న్‌స్టార్‌ స్టెఫానీ క్లిఫార్డ్‌కు.. ట్రంప్‌ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు లైంగిక సంబంధం ఉందన్న దాంట్లో నిజం లేదని వాదించారు.

మరోవైపు ట్రంప్‌తో సంబంధాలపై తనను నోరుమెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్‌ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్‌స్టార్‌ న్యాయమూర్తికి నివేదించింది. పలువురు మహిళలతో ట్రంప్‌ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+