జపాన్‌లో భూకంపం: స్వల్ప సునామీ, భయాందోళనలో ప్రజలు
టోక్యో: ఈశాన్య జపాన్‌లో మంగళవారం ఉదయం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాక తెలిపింది.
కాగా, ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం. ఈ భూకంపం ఉత్తర టోక్యోకు 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్లు తెలుస్తోంది.

ముందు జాగ్రత్తగా 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2011లో ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 18వేల మంది మృత్యువాత పడ్డారు.
పుకుషిమా అణువిద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇదే ప్రాంతంలో చిన్నపాటి సునామీ రావడంతో ఉత్తర జపాన్ వాసులు భయాందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications