ఆత్మాహుతి దాడులు: 40 మంది మృతి
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మరణించారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మద్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
ఈశాన్య నైజీరియాలో ఇద్దరు మహిళా ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. రెండు మసీదులలో జరిపిన పేలుళ్లు, కాల్పులలో 40 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు తెలిపారు.

బొకొ హరమ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు నైజీరియాలోని మిలటరి క్యాంప్ పై గురువారం ఉదయం దాడి చేశారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. 100 మంది బొకొ హరమ్ ఉగ్రవాదులను అంతం చేశామని ఆర్మీ అధికారి కల్నల్ శాని ఉస్మాన్ అన్నారు.
ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 7 మంది సైనికులు మరణించారని, సుమారు 10 మంది గాయపడ్డారని శాని ఉస్మాన్ చెప్పారు. నైజీరియాలో గత కొన్ని రోజుల నుంచి బొకొ హరమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగడంతో సామాన్యులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications