వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ కంప్యూటర్ షట్‌డౌన్, భారత్‌కు ఆప్గన్ థ్యాంక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగవమంతంగా పని చేసే సూపర్ కంప్యూటర్ తియాన్హే - 1ఏను షట్ డౌన్ చేశారు. దీనిని తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్టు చైనా ప్రకటించింది.

ఒక సెకనుకు 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ పూర్తి చేసే సామర్థ్యమున్న ఈ కంప్యూటర్ తియాంజిన్‌లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రంలో ఉంది. గురువారం ఉదయం జరిగిన పేలుళ్లతో సూపర్ కంప్యూటర్ ఉంచిన భవనం పైకప్పు దెబ్బతిన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ గ్వాంగ్ మింగ్ చెప్పారు.

కంప్యూటర్ భద్రత కోసమే షట్‌డౌన్ చేశామన్నారు. వరల్డ్ టాప్ 500 సూపర్ కంప్యూటర్లలో తియాన్హే-1ఏ తొలి స్థానంలో ఉంది. ఉత్తర చైనా తీర పట్టణం టాంజిన్‌లో జరిగిన బాంబు పేలుడులో 44 మంది మరణించారు. 400 మంది గాయపడ్డారు.

Supercomputer shut down due to China blasts

భారత్‌కు కృతజ్ఞతలు

ఆప్ఘాన్ ప్రజలు భారత దేశానికి వినూత్నరీతిలో కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. సల్మా డ్యాం‌ను భారత్ నిర్మిస్తోంది. ఈ డ్యాం నిర్మాణం త్వరలో పార్తవుతోంది. విద్యుదుత్పత్తి, సాగునీటి సరఫరా కోసం నిర్మితమవుతున్న సల్మా డ్యాం పనులను భారత్ ప్రభుత్వం 2006లో ప్రారంభించింది.

ఈ డ్యాం నిర్మాణానికి భారత్ 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. డ్యాం నిర్మాణం ముగుస్తుండడంతో ఆఫ్ఘన్ ప్రజలు మన దేశానికి థ్యాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆప్ఘన్‌లో భారత దౌత్య కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ జాతీయ జెండతో పాటు, వంద మీటర్ల భారత జాతీయ జెండాను ప్రదర్శించారు.

English summary
China shut down supercomputer Tianhe-1A, which can perform 2.57 quadrillion computing operations per second, due to blasts in Tianjin city as it was located a few kilometres from the site of the explosions that killed 44 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X