ఇది యాపారం- మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన నిర్ణయం
ఆమ్‌స్టర్‌డామ్: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్, మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందిన సురేష్ రైనా.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన కొత్త రంగంలో అడుగుపెట్టారు. రెస్టారెంట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఓ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. దీనికోసం స్వయంగా షెఫ్ అవతారాన్ని ఎత్తారాయన.
సురేష్ రైనా- క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 13 సంవత్సరాల పాటు జాతీయ క్రికెట్‌లో సత్తా చాటారు. టీమిండియా తరఫున మొత్తంగా 18 టెస్టులు, 226 వన్డే ఇంటర్నేషనల్స్, 78 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారు. వన్డేల్లో 5,615, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1605 పరుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌పై తనదైన ముద్రవేశారు. మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యాన్ని వహించిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 2008లో తొలి సీజన్ నుంచీ ఆయన ఐపీఎల్‌లో కొనసాగుతూ వచ్చారు. 2020లో తప్ప అన్ని సీజన్లల్లో పార్టిసిపేట్ అయ్యారు.
2020లో వివాదాస్పద కారణాలతో ఐపీఎల్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాతి సీజన్‌లో పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ కేరీర్‌లో 205 మ్యాచ్‌లను ఆడాడు. 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 548 పరుగులు చేశాడు. 2021 తప్పించితే మిగిలిన అన్నింట్లోనూ నిలకడగా రాణించాడు సురేష్ రైనా.
ఇక తాజాగా రెస్టారెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్‌ను ఆరంభించారు సురేష్ రైనా. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో కొత్తగా రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. దీని పేరు రైనా. కలినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్. పూర్తి స్వదేశీ వంటకాలను అందించే రెస్టారెంట్ ఇది. భారత రుచులను యూరోపియన్లకు రుచి చూపించడానికే ఆమ్‌స్టర్‌డామ్‌ను తన కొత్త వ్యాపార కేంద్రంగా ఎంచుకున్నట్లు వివరించారు.
స్వతహాగా సురేష్ రైనా భోజన ప్రియుడు. గతంలో ఆయన గరిటె తిప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తన ఫుడీస్ అడ్వెంచర్‌ను యూరోపియన్లకు పరిచయం చేయబోతోన్నానని చెప్పారు. తన రెస్టారెంట్‌లో ప్రతి వంటకం ఒక కథను చెబుతుందని, ప్రతి బైట్ కూడా భారతీయతను ఉట్టిపడుతుందంటూ భరోసా ఇచ్చారు. నార్త్, సౌత్ ఇండియన్ డిషెస్, ఇక్కడి నుంచే దిగుమతి చేసుకునన మసాలాను వంటకాల కోసం వినియోగిస్తామని చెప్పారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications