భారతీయ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం: పరుగెత్తుకొచ్చి తల్లి ఒడికి
న్యూఢిల్లీ/మనామా: బహ్రెయిన్‌లో కిడ్నాపైన ఐదేళ్ల భారతీయ బాలిక సారా సురక్షితంగా తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంది. మంగళవారం రాత్రి సారాను కారులో ఉంచిన ఆమె తల్లి ఓ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా... బహ్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి(38), ఆసియా సంతతి మహిళ (37) కారుతో సహా ఉడాయించారు.
దీంతో సారా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు.. 25 పహారా వాహనాలను రంగంలోకి దించారు. బహ్రెయిన్ కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించినట్టు తెలిపారు.
I am happy Sarah has been rescued. Thank you Bahrain. pic.twitter.com/Euarj1vWWQ
— Sushma Swaraj (@SushmaSwaraj) 4 August 2016
కిడ్నాపర్లు సారాకు ఎలాంటి ముప్పు తలపెట్టలేదని, సారా ఆరోగ్యంగా ఉందని ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో తల్లిని చూసిన సారా పరుగెత్తుకుంటూ తల్లిని చేరుకుని ఒదిగిపోవడం స్టేషన్ అధికారులను కదిలించింది. కాగా, సారా కిడ్నాప్‌పై మేనమామ అనిశ్ ఛార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ కిడ్నాప్‌లో పాప తండ్రి హస్తం ఉందని ఆరోపించాడు. పాప తండ్రి భారత్‌లో ఉంటున్నాడని, మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, ఈ క్రమంలో ఆయన కుట్రచేసే అవకాశం ఉందని అనిశ్ ఆరోపించాడు.
ఇది ఇలా ఉండగా, భారత బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం కావడం పట్ల విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications