వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా: ఐసీస్ మహిళా బానిసలు రక్షించారు

|
Google Oneindia TeluguNews

ఇరాక్: ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) బారిన పడి నరకం అనుభవించిన మహిళలకు స్థానిక ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కలిసి సహాయపడుతున్నాయి. బాధితులు మానసికంగా నిలదొక్కుకునే వరకు వారికి అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది.

బాధిత మహిళలు వారి కుటుంబంతో కలిసి జీవించేందుకు ప్రతి రోజూ కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్ మోసూల్ తుది దశకు చేరుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటికే చెల్లాచెదురై పారిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బారినపడి బానిసలుగా మారి నగ్నంగా తిరుగుతున్న మహిళలకు ఇప్పుడు సంకీర్ణ దళాల వలన విముక్తి లభిస్తుంది. అయితే ఇప్పటికే సామూహిక అత్యాచారాలకు, లైకింగిక వేధింపులకు గురైన ఆ మహిళలు తీవ్ర నిరాశలో మునిగిపోయి కుంగిపోతున్నారు.

మానసికంగా నలిగిపోతున్న వారికి అండగా ఉంటూ సంరక్షణా కేంద్రంలో చికిత్స చేస్తున్నారు. ఆ మహిళలు, యువతులు మామూలు మనుషులు అయ్యేందుకు సహకరిస్తున్నామని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర అధికారులు చెబుతున్నారు.

Syrian women’s saved from ISIS

డాక్టర్ నామ్ నవ్జత్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ మహిళల పరిస్థితుల గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందని అన్నారు. గత మూడేళ్లుగా బాధితులకు సేవలు అందిస్తున్నామని, ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారంలో మునిగిపోయారని అన్నారు.

ఎనిమిదేళ్ల బాలికలపైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అత్యాచారానికి ఒడిగట్టారని డాక్టర్ నామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు తనను ఐదు సార్లు బానిసగా అమ్మేసారని, రోజూ అత్యాచారం చేసేవారని బాధిత మహిళ వాపోయింది.

తనను సిరియా, మోసూల్, తలాఫర్, అన్బర్ ప్రాంతాల్లో నగ్నంగా తిప్పారని ఆమె చెప్పారు. అక్కడి నుంచి బయటపడడం ఎలాగో అర్థంకాక నాలుగు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె చెప్పారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద బాధిత మహిళలకు ధైర్యం చెప్పామని, అందరికీ పునరావాసం కల్పించేందుకు ఎన్జీవోల సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సంకీర్ణ దళాలు ఇరాక్‌లోకి ప్రవేశించిన తర్వాతే తమకు స్వేచ్ఛ లభించిందని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద బాధిత మహిళలు బోరున విలపిస్తున్నారు.

English summary
Shortly after militants were driven from the city, local news reported Manbij’s women were also organising an all-female council to protect and promote the rights of women and girls in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X