చారిత్రక నిర్మాణంగా అంగ్‌కోర్ వాట్‌కు రెండు, తాజ్ మహల్‌కు 3వ స్థానం
లండన్: ప్రపంచంలోని అత్యంత గొప్ప చారిత్రక నిర్మాణాల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పాలరాతి అద్భుతం తాజ్ మహల్ మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పెరూలోని మచ్చుపిచ్చు నిలబడింది. రెండో స్థానంలో కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ మూడు ప్రాంతాలకు ఆయా ర్యాంకులు కేటాయించారు. పర్యాటకానికి సంబంధించిన ప్రఖ్యాత వెబ్ సైట్ ఒకటి ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేసింది.

ఏటా తాజ్ మహల్ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇరవై నుండి నలభై లక్షల మంది వస్తారు. అందులో విదేశీ పర్యాటకులు రెండు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది.
తాజ్ మహల్‌ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారు. అతను తన భార్య ముంతాజ్ పైన ప్రేమతో నిర్మించాడు. ఇది ఆగ్రాలో ఉంది. 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.












Click it and Unblock the Notifications