నేను బతికే ఉన్నా: తాలిబన్ చీఫ్ ఆడియో విడుదల
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో జరిగిన కాల్పుల్లో తాను చనిపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను బతికే ఉన్నానని తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ స్పష్టం చేశాడు. అప్ఘనిస్తాన్ తాలిబన్ విడుదల చేసిన ఓ ఆడియోలో అతను ఈ విషయం స్పష్టం చేశాడు.
పాకిస్తాన్‌లోని కుచ్లక్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో తాను గాయపడినట్లు గానీ చనిపోయినట్లు గానీ వచ్చిన వార్తలు అబద్ధమని, తనతో పాటు తన సహచరులు క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశాడు. తాను కుచ్లక్‌లో లోనని, కుట్రలో భాగంగా ప్రత్యర్థులు ఈ వదంతులు పుట్టించారని ఆయన అన్నారు.

తాలిబన్ల మధ్య విభేదాలు సృష్టించడానికే ఆ పుకార్లు వ్యాపింపజేశారని విమర్శించాడు. పాకిస్తాన్‌వో మన్సూర్ మరణించినట్లు అఫ్గాన్ అధికారి ఒకరు ప్రకటించిన రెండు రోజుల తర్వాత శనివారంనాడు ఆ ఆడియోను విడుదల చేశారు.
తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తన అనుచరులకు విజ్ఞప్తి చేశాడు. అప్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పాడు.












Click it and Unblock the Notifications