Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్ల వేట మొదలైంది ; యూఎస్, నాటో దళాలకు సహకరించిన వారి కోసం ఇల్లిల్లూ గాలింపు, ఆఫ్ఘన్లలో భయం !!

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు భయపడిందే జరుగుతోంది. తాలిబన్ల ఆటవిక పాలన మళ్లీ మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజాస్వామ్యం ఉండబోదని, షరియా చట్టం మాత్రమే అమలులో ఉంటుందని తాలిబన్లు తేల్చిచెప్పారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు గతంలో తాము చేసిన పాలనకు భిన్నంగా పరిపాలన చేస్తామని చెప్పి, ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని చెప్పి ఇప్పుడు అందుకు భిన్నంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను వేధిస్తున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలోఅమెరికాకు, నాటో దళాలకు సహకరించిన వారికోసం ఇల్లిల్లూ గాలిస్తున్నారు తాలిబన్లు.

 యూఎన్ కు అందిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ .. తాలిబన్ల చర్యలపై షాకింగ్ విషయాలు

యూఎన్ కు అందిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ .. తాలిబన్ల చర్యలపై షాకింగ్ విషయాలు

తాలిబాన్లు ఇంటింటికీ తిరుగుతూ తమను వ్యతిరేకించే ప్రత్యర్థులు మరియు వారి కుటుంబాల కోసం వెతుకుతున్నారు. యునైటెడ్ నేషన్స్ కు అందించిన ఓ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ కొత్త పాలకులు తాము సంయమనం పాటిస్తామని చేసిన ప్రతిజ్ఞను విరమించుకున్నట్లుగా తెలిసింది. రెండు దశాబ్దాల యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆదివారం ప్రభుత్వ బలగాలను కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, కఠినమైన ఇస్లామిస్ట్ ఉద్యమ నాయకులు పదేపదే సంపూర్ణ క్షమాభిక్షను ప్రసాదిస్తామని, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టమని ప్రతిజ్ఞ చేశారు. మహిళల హక్కులు గౌరవించబడుతాయని వెల్లడించారు. తాలిబన్లు 1996-2001 వారి క్రూరమైన పాలనలా కాకుండా ఈసారి ప్రజలకు అనుకూలంగా భిన్నంగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా తాలిబన్ల ప్రవర్తన ఉంది.

యూఎస్ నాటో దళాలతో పని చేసిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఇంటింటి శోధన

యూఎస్ నాటో దళాలతో పని చేసిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఇంటింటి శోధన

వేలాది మంది ప్రజలు ఇప్పటికే దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం తమ బిడ్డలనైనా కాపాడాలని ముళ్లకంచెలపై నుండి పిల్లలను విమానాశ్రయాల్లోకి విసిరేస్తున్నారు. ఇక తాజా పరిస్థితులలో ఐక్యరాజ్యసమితి నివేదిక ఆఫ్ఘనిస్థాన్ ప్రజల భయాలను ధృవీకరించింది. AFP గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ ఐక్యరాజ్యసమితికి అందిన ఇంటలిజెన్స్ రిపోర్ట్ ను వెల్లడించింది. యూఎస్ మరియు నాటో దళాలతో పనిచేసిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ డోర్-టు-డోర్ శోధన తాలిబన్లు నిర్వహిస్తున్నారు.

యూఎస్ కు సహకరించిన వారిని హింసిస్తున్నారని, చంపేస్తారని ఆందోళన

యూఎస్ కు సహకరించిన వారిని హింసిస్తున్నారని, చంపేస్తారని ఆందోళన

నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎనలైసిస్ రాసిన నివేదిక, కాబూల్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో తాలిబన్ మిలిటెంట్లు కూడా ప్రజలను తనిఖీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. గతంలో నాటో, యుఎస్ దళాలు మరియు వారి మిత్రులతో కలిసి పనిచేస్తున్నవ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు తాలిబన్ల చేతిలో చిత్రహింసలు ,మరణశిక్షలకు గురవుతారని ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు భయపడుతున్నారు. గతంలో తాలిబన్లు అటువంటి ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే.

 రోడ్ల మీద వెళ్ళే వారిని కూడా శోధిస్తున్న తాలిబన్లు ,.. మళ్ళీ అదే ఆటవిక పాలన

రోడ్ల మీద వెళ్ళే వారిని కూడా శోధిస్తున్న తాలిబన్లు ,.. మళ్ళీ అదే ఆటవిక పాలన


తాలిబన్ తీవ్రవాదులు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించకుండా నిషేధించామని అనేకసార్లు ప్రకటనలు జారీ చేసింది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా వ్యక్తమవుతోంది. ఇంటింటికీ తిరుగుతూ, రోడ్ల మీద వెళ్ళే వారిని కూడా తనిఖీలు చేస్తున్న తాలిబన్ల వైఖరి తీవ్ర ఆందోళనలకు కారణంగా మారుతుంది .గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలో, మహిళలు బయటకు రావాలంటేనే భయపడ్డారు. బుర్ఖాలు ధరించి చీకట్లోనే జీవించాల్సిన పరిస్థితి మహిళలకు ఉండేది. బాలికలను పాఠశాల నుండి నిషేధించారు. వ్యభిచారం వంటి నేరాలకు పాల్పడితే ప్రజలు రాళ్లతో కొట్టబడ్డారు. సంగీతం మరియు టెలివిజన్‌లు కూడా నిషేధించబడ్డాయి. ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి పరిస్థితి ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంటుంది.

అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆఫ్ఘన్ ప్రజల దుస్థితి

అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆఫ్ఘన్ ప్రజల దుస్థితి

దీనిపై ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 20 సంవత్సరాల విజయాలు వృధాగా పోవడాన్ని అనుమతించ లేని కొందరు తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ప్రతిఘటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా 20 సంవత్సరాలుగా యూఎస్, నాటో దళాలకు సహకరించి తాలిబన్లపై పోరాటం సాగించిన వారందరూ ఇప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో బ్రతుకుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+