ఐసిస్ కు తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్-ఆప్ఘన్ రోడ్లపై బల ప్రదర్శన-యూఎస్ ట్యాంకులు, ఆయుధాలతో
ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లకు ఐసిస్ వరుస దాడులు చికాకుపెడుతున్నాయి. ఐసిస్ దాడుల నుంచి ఆప్ఘన్ ప్రజల్ని రక్షించడంలో వరుసగా విఫలమవుతుండటంతో తాలిబన్ల పాలనపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఏకంగా మసీదుల్లోనే ఆత్మాహుతి దాడులు జరుగుతుండటంతో తాలిబన్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తాజాగా తాలిబన్లు ఆప్ఘన్ వీధుల్లో భారీ పరేడ్ నిర్వహించారు. ఇందులో యూఎస్ యుద్ధట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించి ఐసిస్ కు హెచ్చరికలు పంపారు.

ఆప్ఘన్ లో ఐసిస్ దాడులు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారం చేపట్టిన తాలిబన్లకు ఐసిస్ దాడులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ దాడుల్లో తాలిబన్ ఫైటర్లతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీ సంఖ్యలో చనిపోతున్నారు. అదీ ఆత్మాహుతి దాడులు కావడంతో తప్పించుకునేందుకు వీల్లేకుండా పోతోంది. దీంతో తాలిబన్లపై ఆధిపత్యం చాటుకునేందుకు ఐసిస్ చేస్తున్న ప్రయత్నాలు దాడుల రూపంలో జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు కూడా భారీ సంఖ్యలో చనిపోతుండటంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది.

తాలిబన్లపై సన్నగిల్లుతున్న విశ్వాసం
ఆప్ఘనిస్తాన్ లో ఐసిస్ దాడులతో ప్రజలతో పాటు ప్రభుత్వంలోనూ భయాందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా తాలిబన్ ఫైటర్లను, ప్రభుత్వంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులతో ఇబ్బందులు తప్పడం లేదు. తమను తాము రక్షించుకోలేని వారు తమను ఏం రక్షిస్తారన్న చర్చ జరుగుతోంది. ఐసిస్ దాడుల్ని అడ్డుకునేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. దీంతో ప్రజల్లోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అయ్యే ఆప్ఘనిస్తాన్ గడ్డపై ఐసిస్ దాడులతో తాలిబన్లు ప్రజల ముందు పలుచన అవుతున్నారు. దీంతో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
ఆప్ఘన్ వీధుల్లో యూఎస్ ట్యాంకులతో పరేడ్
ఆప్ఘనిస్తాన్లో ఐసిస్ దాడులతో నెలకొన్న భయాందోళనల్ని తొలగించేందుకు తాలిబన్లు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆప్ఘన్ వీధుల్లో తాజాగా యూఎస్ బలగాలు వదిలివెళ్లిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో భారీ పరేడ్ నిర్వహించారు. ఇందులో పలు అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో రోడ్లపై నిర్వహించిన పరేడ్ ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించాలనేది తాలిబన్ల వ్యూహంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్లపైకి యుద్ధట్యాంకులు, ఆయుధాలతో తాలిబన్లు కనిపించడంతో ప్రజలకు కాసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ తర్వాత అది ప్రభుత్వ పరేడ్ అని తెలిసి జనం మౌనంగా వాటిని తిలకించారు.
Recommended Video

ఐసిస్ కు తాలిబన్ల హెచ్చరికలు
ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తమకు అవకాశం దక్కలేదన్న అక్కసుతో వరుస దాడులు చేస్తున్న ఐసిస్ కు గట్టి హెచ్చరికలు పంపాలని తాలిబన్ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే తమ దేశంలో యూఎస్ బలగాలు వదిలివెళ్లి యుద్ధ ట్యాంకులు, అత్యాథునిక ఆయుధాలతో రోడ్లపై భారీ పరేడ్ నిర్వహించారు. తద్వారా తమ వద్ద యూఎస్ ట్యాంకులు, ఆయుధాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి ఐసిస్ పై దాడులకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు గట్టి హెచ్చరికలు పంపారు. తద్వారా ఆప్ఘన్ గడ్డపై తాలిబన్లను ఎదిరించే సత్తా ఐసిస్ కు లేదనే అంశాన్ని ఈ పరేడ్ రూపంలో తాలిబన్లు చూపించినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications