వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్‌లో తాలిబాన్ల శకం: నేటి నుంచి పరిపాలన

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల ఏలుబడిలోకి రానుంది. ఇవాళ తాలిబాన్లు అధికారం చేపట్టబోతున్నారు. ఆప్ఘన్‌ను హస్తగతం చేసుకున్న.. రెండు వారాల తర్వాత పగ్గాలు చేపట్టబోతున్నారు. శుక్రవారం ప్రార్థనలు చేసిన తర్వాత.. అధికారం చేపడుతారని విశ్వసనీయ సమాచారం.. గతనెల 15వ తేదీన కాబుల్ ఆక్రమణతో తాలిబాన్లు క్రమంగా పట్టుసాధించారు. ఆ తర్వాత అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంతో తాలిబాన్లు విజయం సాధించారు.

 Taliban to form government in Afghanistan today

దేశంలో శాంతి, సామరస్యం నెలకొల్పుతామని.. భద్రతాపరమైన అంశాలకు రాజీపడబోమని చెప్పారు. అమెరికా బలగాలు పూర్తిగా తరలిపోయాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజాన్ని సాయం కోరుతున్నారు తాలిబాన్లు. ఆప్ఘన్‌లో పెట్రో ప్రధాన ఆదాయ వనరు.. తమకు సాయం చేస్తే క్రూడాయిల్‌లో మేలు చేస్తామని తాలిబాన్లు చెబుతున్నారు.

ఇదివరకు కాబుల్ విమానాశ్రయంలో అమెరికా సేనలు ఉండేవి. ఒప్పందం ప్రకాశం ఆగస్ట్ 31వ తేదీన అమెరికా బలగాలు తరలిపోయాయి. ఈ మేరకు తాలిబాన్లు అధికార ప్రకటన కూడా చేశారు. అమెరికా ఆప్ఘనిస్తాన్ మధ్య గత 20 ఏళ్లుగా యుద్దం జరుగుతుందని పేర్కొన్నది. మరోవైపు తమ చివరి సైనికుడు తరలివచ్చే దృశ్యాన్ని అమెరికా కూడా షేర్ చేసుకుంది. ఆర్మీ మేజర్ జనరల్ క్రిస్ తరలింపును షేర్ చేశారు.

English summary
Taliban are all set to form a government in Afghanistan after Friday prayers today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X