Mullah Baradar: ఆఫ్ఘనిస్తాన్‌కు కాబోయే అధ్యక్షుడిగా: షరియా చట్టంలో
కాబుల్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మీదే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు తాలిబన్ల వశంలోకి వెళ్లిపోయింది. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్దిరోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ఇన్ని సంవత్సరాలు పాటు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియకుండా పోయిన తాలిబన్లు- అమెరికా అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా పడగ విప్పారు. దేశాన్ని ఆక్రమించుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు.
Recommended Video

ఉనికిలో లేకున్నా..
ఇంత పగడ్బందీగా ఓ దేశాన్ని స్వాధీనం చేసుకోవడమంటే మాటలు కాదు. పైగా రెండు దశాబ్దాలుగా ఆచూకీ తెలియని స్థితికి, ఉనికి కోల్పోయిన దశకు చేరుకున్న తరువాత కూడా తమకు ఎదురుగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోగానే.. విరుచుకుపడటం అనేది ఏ మాత్రం అంచనాలకు అందనిది. చివరికి- అమెరికా సైతం ఈ పరిణామాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. తాలిబన్లకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అయ్యేదే. తాలిబన్ల బలమైన నాయకత్వం, కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పుణికి పుచ్చుకున్న లీడర్లు అతి కొద్దిమందే ఉన్నారు.

కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక
తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వానికి అబ్దుల్ ఘనీ బరాదార్ సారథ్యాన్ని వహించే అవకాశాలు ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముల్లా బరాదర్ పేరు వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా ముల్లా బరాదర్.. బాధ్యతలను స్వీకరించడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. కాందహార్ సమావేశాల్లోనే ఈ దిశగా ఓ నిర్ణయానికి వస్తారని, అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కాని, ముల్లా యాకూబ్, రాహ్బరి షురా వంటి కీలక నేతల సమక్షంలో బరాదర్ ఎంపిక జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

తాలిబన్ కో ఫౌండర్
ముల్లా బరాదర్.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం పొలిటికల్ వింగ్ అధిపతిగా వ్యవహరిస్తోన్నాడు. అతణ్ని అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెజ్కీలతో కలిసి ముల్లా బరాదర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. ఈ ముగ్గురూ కూడా ఇదివరకు కాందహార్‌లో ఉండేవారని, తాజాగా- కాబుల్‌కు చేరుకున్నారని చెబుతోంది.

చట్టాలపై సమగ్ర అవగాహన..
షరియా చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండటం ముల్లా బరాదర్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ఓ కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. 1996 నుంచి 2001 మధ్య ఆప్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తాలిబన్లు.. ఈ చట్టాన్ని ప్రజలపై ప్రయోగించిన విషయం తెలిసిందే. మత ఛాందసవాదానికి ప్రతీకగా భావిస్తారు.. ఈ చట్టాన్ని. 20 సంవత్సరాల కిందటి పరిస్థితులు ఇప్పుడు లేనందున.. షరియా చట్టంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని తాలిబన్ ట్యాప్ క్యాడర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

బరాదర్ సహా..
సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రజలకు భద్రత, సామాజికాంశాలను కేంద్రబిందువుగా చేసుకుని కాందహార్ వేదికగా మూడు రోజుల పాటు వరుస భేటీలు నిర్వహిస్తామని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తమ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా పేరు మార్చబోతోన్నామని స్పష్టం చేశారు. తాలిబన్ల లీడర్‌షిప్ స్ట్రక్చర్‌లో కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. షరియా చట్టంపై ఈ భేటీలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications