తాలిబన్లపై పాక్ నియంత్రణ కష్టం-భారత్ పాత్ర ఉండాల్సిందే-అష్రఫ్ ఘనీ సోదరుడి కామెంట్స్

ఆప్గానిస్తాన్ లో దురాక్రమణతో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి పాగా వేసిన తాలిబన్లకు కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంత సులువుగా కనిపించడం లేదు. అదే సమయంలో తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కూడా పూర్తిస్దాయిలో తమకు మద్దతిచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. నేరుగా తాలిబన్లకు మద్దతిస్తే అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తుందన్న భయాలు పాకిస్తాన్ ను వెంటాడుతున్నాయి. అదే సమయంలో తాలిబన్లకు ఆర్ధికంగా సాయం చేసేందుకు కూడా పాకిస్తాన్ ఆర్ధిక పరిస్దితి సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఇన్నాళ్లు ఆప్ఘన్ ప్రజలకు అండగా నిలిచిన భారత్.. ఇప్పుడు కష్టకాలంలోనూ వారికి అండగా ఉండాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

 ఆప్ఘన్ లో తాలిబన్ సర్కార్

ఆప్ఘన్ లో తాలిబన్ సర్కార్

ఆప్ఘనిస్తాన్ లో అష్రప్ ఘనీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ పాగా వేసిన తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నారు. అయితే తాలిబన్లతో పాటు హక్కానీ నెట్ వర్క్, ఇతర తీవ్రవాద సంస్ధలకు చెందిన నేతలు కూడా ప్రభుత్వంలో చోటు కావాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలనే అంశంలోనూ పాకిస్తాన్ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది.

ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మొహమూద్ ఖురేషీ ఆప్గనిస్తాన్ వెళ్లారు. తాలిబన్ ముఖ్యనేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇందులో తాలిబన్లకు పాకిస్తాన్ నుంచి అవసరమైన సాయం చేస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 పాక్ సాయం మాటల్లోనే

పాక్ సాయం మాటల్లోనే

ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు కేవలం మాటలకు పరిమితమయ్యేలా తెలుస్తోంది. అంతర్జాతీయంగా తమపై ఉన్న ఒత్తిడితో పాటు అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాల నుంచి తాలిబన్లపై ఎదురవుతున్న వ్యతిరేకత వంటి అంశాలు పాకిస్తాన్ చేతుల్ని కట్టిపాడేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మాట సాయం వరకూ పాకిస్తాన్ పరిమితమయ్యేలా ఉంది.

ఆప్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించగానే వారికి మద్దతిచ్చిన పాకిస్తాన్ ఇప్పటివరకూ ఆ దేశానికి తమ ప్రతినిధుల్ని పంపలేదు. తాజాగా పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మెహమూద్ ఖురేషీ అక్కడికి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపి వచ్చారు. ఓసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకు పాకిస్తాన్ కృషి చేసే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

 తాలిబన్ల నియంత్రణ కష్టమే

తాలిబన్ల నియంత్రణ కష్టమే

ఆప్ఘనిస్తాన్ లో ఓసారి తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకే పాకిస్తాన్ తో అవసరం అన్నట్లుగా పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దాన్ని నియంత్రించే శక్తి పాకిస్తాన్ కు లేదని ఆప్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు, తాలిబన్ మద్దతుదారుడు కూడా అయిన హష్మత్ ఘనీ చెప్తున్నారు.

పాకిస్తాన్ కు ప్రస్తుత పరిస్దితుల్లో తాలిబన్లను నియంత్రించే సత్తా లేదని ఆయన తాజాగా సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని హష్మత్ ఘనీ వెల్లడించారు. పాకిస్తాన్ ఆప్ఘనిస్తాన్ వ్యవహారాల్లో పాలుపంచుకోలదు కానీ తాలిబన్లను నియంత్రించలేదని ఆయన తెలిపారు.

పాక్ ఎందుకు నియంత్రించలేదంటే ?

పాక్ ఎందుకు నియంత్రించలేదంటే ?

ఆప్ఘనిస్తాన్ లో ఏర్పడే తాలిబన్ సర్కార్ ను నియంత్రించాలంటే వారిని శాసించగలిగేంత డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల సాగు, రవాణాతో భారీగా డబ్బు ఆర్జిస్తున్న తాలిబన్లు ఇప్పుడు ప్రభుత్వ పాలనలోకి దాన్ని తీసుకురాబోతున్నారు. అప్పుడు అదంతా అధికారికమే అవుతుంది. కానీ తాలిబన్లను నియంత్రించాలనుకుంటున్న పాకిస్తాన్ మాత్రం వారి కోసం డబ్బు ఖర్చుపెట్టే పరిస్దిథి లేదు.

అది ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కూడా. ఎందుకంటే ప్రస్తుత కరోనా పరిస్దితుల్లో పాకిస్తాన్ ఆర్దిక వ్యవస్ద చాలా బలహీనంగా ఉంది. దాన్ని పణంగా పెట్టి తాలిబన్లకు డబ్బు సమకూర్చాలని భావిస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు. అలాగని పూర్తిగా దూరంగా ఉండిపోవడం కష్టం. కాబట్టి పరోక్షంగా తాలిబన్లు ఆర్ధిక వనరులు మెరుగుపర్చుకునేందుకు పాకిస్తాన్ సహకరించే అవకాశాలున్నాయి.

భారత్ పై పెరుగుతున్న ఒత్తిడి

భారత్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో భారత్ ఎలాంటి పాత్ర పోషించబోతుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ఆప్ఘన్ ప్రజా ప్రభుత్వం కుప్పకూలాక తాలిబన్ల నుంచి భారతీయుల్ని రక్షించుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ తాలిబన్లతో ఎలా వ్యవహరించబోతోందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఓసారి బారతీయులంతా ఆప్ఘన్ నుంచి వచ్చేస్తే ఆ తర్వాత కేంద్రం ఆ దేశం విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకూ కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ ఉనికి తప్పదన్న హష్మత్ ఘనీ

భారత్ ఉనికి తప్పదన్న హష్మత్ ఘనీ

ఆప్ఘనిస్తాన్ కు ఇన్నాళ్లూ ఆండగా నిలిచిన భారత్.. తాలిబన్ల పాలనలోనూ ఆ దేశానికి అండగా ఉండాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ వీడిన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ తమ దేశంలో భారత్ ఉండి తీరాల్సిందేనని చెప్తున్నారు. ఆప్ఘనిస్తాన్ లో ఏ ప్రభుత్వం ఉందన్న దానితో సంబంధం లేకుండా భారత్ తన ఎంబసీని తెరిచి ఉంచాలని హష్మత్ ఘనీ కోరుతున్నారు. దీంతో ఇప్పుడు తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న హష్మత్ ఘనీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాలిబన్లకు అంతర్జాతీయ మద్దతు కావాలన్నా, భవిష్యత్ పరిణామాల్లో అక్కడి పౌరుల భద్రత దృష్టికోణెంలో చూసినా భారత్ ఉనికి తప్పదనే వాదన వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+