భారత్ కు తాలిబన్ల షాక్-చైనా మిత్రదేశమని ప్రకటన- కొత్త ప్రభుత్వ అజెండా వెల్లడి
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసకున్న తాలిబన్లు కొత్త సర్కార్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం తరఫున తమ అజెండా కూడా ప్రకటించారు. ఉపఖండంలోని దేశాల్లో ఎవరు తమకు మిత్రులన్నది కూడా వెల్లడించారు. ఆ నిర్ణయం వెనుక కారణాలను కూడా తాలిబన్లు ఇవాళ వెల్లడించారు. దీంతో భారత్ సహా పలు ఉపఖండ దేశాలకు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా తాలిబన్లపై భారీ ఆశలు పెట్టుకున్న భారత్ కు గట్టి షాక్ తగిలింది.
Recommended Video
ఆప్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుు తాలిబన్లు తమ అజెండా బయటపెట్టారు. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆఫ్గనిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి, పునర్నిర్మించడానికి చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు, చైనా ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశ ద్వారం అందిస్తుందని ఆశించినట్లు బ్రిటన్ నుంచి వెలువడే ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది. "చైనా మా ప్రధాన భాగస్వామి, మా దేశంలో పెట్టుబడి పెట్టడానికి, పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్నందున మాకు ప్రాథమిక, అసాధారణమైన అవకాశాన్ని ఇది అందిస్తుందని ముజాహిద్ వెల్లడించాడు. పురాతన సిల్క్ రోడ్‌ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్‌ను తాము గౌరవిస్తామని, దీనికి మించి తమ వద్ద గొప్ప రాగి గనులు ఉన్నాయిని, అవి చైనీయుల కోసం తిరిగి ఉత్పత్తిలోకి తీసుకొస్తామని తాలిబన్ నేత ముజాహిద్ వెల్లడించారు.

ఆప్గనిస్తాన్ లో మారుతున్న పరిస్ధితుల్లో భారత్ తో సహా ఏ ఇతర దేశాన్నీ దూరం చేసుకోబోమని చెబుతూ వస్తున్న తాలిబన్లు ఇవాళ రూటుమార్చినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ లో పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు, వాణిజ్యం వంటి విషయాల్లో చైనా నుంచి గట్టి హామీ లభించడంతో ఇప్పుడు చైనాను తమ మిత్రదేశంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల నిర్ణయంతో ఇప్పటికే అక్కడ వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టిన భారత్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.
మరోవైపు ఆప్గనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో పరిణమాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకూ ఆఫ్ఘన్ ను పాలించిన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందలాది అపరిచిత జీ మెయిల్ ఖాతాల్ని గూగుల్ రద్దు చేసింది. వీటిని అష్రప్ ఘనీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. తాలిబన్ల పాలన మొదలుకాబోతున్న నేపథ్యంలో గతంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఈ ఖాతాల్ని గూగుల్ డిలీట్ చేసింది. కొత్త ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండాై ఉండేందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications