అమ్రుల్లా సాలేహ్ ఇంట్లో 6.5 మిలియన్ యూఎస్ డాలర్లు- తాలిబన్ల స్వాధీన ప్రకటన
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. కానీ ఆయన ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్ మాత్రం తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని తాలిబన్లపై పోరాటం కొనసాగిస్తానని గంభీరమైన ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత పరిస్దితి మారిపోయింది. పంజ్ షీర్ లో ప్రతిఘటన దళాలతో కలిసి కొన్నిరోజులు పోరాటం చేశాక ఆయన కూడా దేశం విడిచి పారిపోయారు.
పంజ్ షీర్ లో పోరాటం ముగిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన అమ్రుల్లా సాలేహ్ ఇప్పుడు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే అమ్రుల్లా సాలేహ్ వెళ్లిపోయాక ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న తాలిబన్లకు అక్కడ భారీ ఎత్తున యూఎస్ కరెన్సీ దొరికింది. ఏకంగా 6.5 మిలియన్ యూఎస్ డాలర్ల కరెన్సీ ఈ సోదాల్లో లభ్యమైనట్లు తాజాగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. యూఎస్ డాలర్ తో పోలిస్తే ఎన్నో రెట్లు తక్కువగా ఉండే ఆప్ఘన్ కరెన్సీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు ఈ మొత్తాన్ని తాలిబన్లు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి అమెరికా బలగాల సాయంతో ప్రభుత్వాన్ని నడిపిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా చివరి నిమిషంలో తాను పారిపోయే సమయంలో భారీ ఎత్తున యూఎస్ కరెన్సీతో పారిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే తనకు హెలికాఫ్టర్ ఎక్కే సమయం కూడా లేదని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. కానీ అక్కడే ఉండిపోయిన చాలా మంది నేతల వద్ద కూడా యూఎస్ కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని మారకం చేసుకని వారు ఎంచక్కా వాడుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి ఇళ్లపై ప్రస్తుతం తాలిబన్లు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారీఎత్తున కరెన్సీ వెలుగుచూస్తోంది. దీన్ని ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం వాడుతామని తాలిబన్లు చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం వీరి మాటలు అస్సలు నమ్మడం లేదు. మరోవైపు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఆప్గనిస్తాన్ లో ప్రజల్ని ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచదేశాలు ముందుకు రావాలని కోరుతున్నాయి.
Taliban say they have found 6.5M US dollars from @AmrullahSaleh2 house when they were searching. pic.twitter.com/3L1ryVWObT
— Tajuden Soroush (@TajudenSoroush) September 13, 2021












Click it and Unblock the Notifications