తాలిబన్ సర్కార్ 2.0 - మళ్లీ పాత శిక్షలు-నరికివేతలూ-ఉరిశిక్షలు-బహిరంగ అమలుపై చర్చలు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ స్ధానంలో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వం స్ధానికుల మద్దతు కోసం ప్రయత్నిస్తోందన్న సంకేతాలు ఓవైపు వెలువడుతుండగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని వారే తేల్చి చెప్పేస్తున్నారు. తమ పాలనలో షరియా చట్టాల అమలే తప్ప ప్రజాస్వామ్యం ఉండబోదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన తాలిబన్లు.. ఇఫ్పుడు గతంలో తాము విధించిన కఠిన శిక్షల్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. త్వరలోనే ఈ శిక్షల అమలు ప్రారంభం కానున్నట్లు సంకే,తాలు కూడా ఇచ్చారు.

తాలిబన్ల కఠిన శిక్షలు
గతంలో 1996 నుంచి 2001 మధ్య ఆప్ఘనిస్తాన్ ను పాలించిన తాలిబన్లు అప్పట్లో క్రూరులుగా పేరు తెచ్చుకున్నారు. ఆప్ఘన్ గడ్డపై షరియా చట్టాలకు వ్యతిరేకంగా జరిగే అన్ని చర్యల్ని అడ్డుకోవడమే కాకుండా దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరికీ కఠినమైన శిక్షలు విధించే వారు. ఇందులో చేతుల నరికివేతతో పాటు ఉరిశిక్షలు కూడా ఉండేవి. అచ్చు అల్ ఖైదా అమలు చేసే విధంగానే తాలిబన్ల శిక్షలు ఉండేవి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వచ్చినా తాలిబన్లు ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ప్రపంచదేశాలు జోక్యం చేసుకోలేని పరిస్ధితి అప్పట్లో ఉండేది.

ఈసారి తాలిబన్లపై అంచనాలు
గతంలో ఆప్ఘన్ పౌరుల్ని తమ దారుణమైన శిక్షలతో భయభ్రాంతులకు గురిచేసిన తాలిబన్లు ఈసారి మాత్రం అంత దారుణంగా వ్యవహరించబోరనే అంచనాలు నిన్న మొన్నటిదాకా ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి తాము మారినట్లు వారే సంకేతాలు ఇస్తుండటమే ఇందుకు కారణం. మానవ హక్కులతో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తామని తాలిబన్లు గతంలో ప్రకటించారు. అంతే కాదు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అప్పటిదాకా పాపాలు చేసిన ప్రజల్ని క్షమించేస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో తాలిబన్లు నిజంగానే మారిపోయారని అంతా భ్రమపడ్డారు.

అసలు రూపం బయటపెట్టిన తాలిబన్లు
ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులైనా గడవకముందే తాలిబన్లు అసలు రూపం బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో మహిళలకు స్ధానం కల్పిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అంతే కాదు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తిరుగుబాటుదారుల్ని అణచివేసే పనిలో తాలిబన్ ఫైటర్లు బిజీగా ఉన్నారు. అదే సమయంలో షరియా పాలన తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని తాలిబన్లు తేల్చి చెప్పేశారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా కఠిన శిక్షలు తప్పవని తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.

చేతులు, తలల నరికివేత, ఉరిశిక్షలే ఇక...
ఆప్ఘనిస్తాన్ లో గతంలో తాము పాలన సాగించినప్పుడు షరియా చట్టాల్ని పాటించని వారికి తాలిబన్లు చేతుల నరికివేత, ఉరిశిక్షలు కూడా విధించే వారు. ఇప్పుడు మరోసారి అవే శిక్షల్ని తిరిగి అమలు చేయాలని తాలిబన్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇస్లామిక్ చట్టం కఠినంగా అమలు చేస్తాడని పేరున్న ముల్లా నూరుద్దీన్ తురాబి... షరియా చట్టాలను అనుసరించాల్సిన అవసరం ఉన్నందున మరణశిక్షలు, శిరచ్ఛేదనాలు త్వరలో తిరిగి వస్తాయని ప్రకటించారు. భద్రత కోసం చేతులు కత్తిరించడం చాలా అవసరమని తురాబీ తేల్చిచెప్పేశాడు. అయితే బహిరంగంగా శిక్షలు విధించాలా వద్దా అనే విషయాన్ని మాత్రం కేబినెట్ అధ్యయనం చేస్తోందని తెలిపాడు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications