Bangladesh: భారత్ కు బంగ్లా కాబోయే ప్రధాని తొలి షాక్..! అప్పుడే మొదలుపెట్టేశారా?
బంగ్లాదేశ్ (Bangladesh)లో తాజాగా పార్లమెంట్ ఎన్నికల జరిగిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే భారత్ తో సంబంధాలు మెరుగుపడతాయని, హిందువుల హత్యలు ఆగుతాయని, మళ్లీ పాత రోజులు వస్తాయని భావించిన వారికి చేదువార్త అందుతోంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షుడు, కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టకముందే భారత్ తో సంబంధాలపై షాకిచ్చారు.
బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఇతరుల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని తారిఖ్ రెహ్మాన్ తేల్చిచెప్పేశారు. బంగ్లాదేశ్, దాని ప్రజల ప్రయోజనాలు తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయన్నారు. భారతదేశంతో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. స్వేచ్ఛను ప్రేమించే ప్రజాస్వామ్య అనుకూల ప్రజలు మరోసారి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి విజయం తెచ్చిపెట్టారని తారిఖ్ చెప్పుకొచ్చారు.

బంగ్లాదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ.. తమ ప్రజల ప్రయోజనాలే ముందు ముఖ్యమైనవని తారిఖ్ రెహ్మాన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడటం ద్వారా, తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వం అంతర్జాతీయ సంబంధాలను ఎలా నిర్వహిస్తుందో దానికి సమాధానంగా.. బీఎన్పీ సీనియర్ నాయకుడు అమీర్ ఖస్రు మహమూద్ చౌదరి .. పార్టీ బహుపాక్షికతకు కట్టుబడి ఉంటుందని, దేశ-కేంద్రీకృత విధానాన్ని అనుసరించదని అన్నారు. అయితే రెహమాన్ బంగ్లాదేశ్ ఫస్ట్ విధానం భారతదేశం, చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలతో సంబంధాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications