ఇక ట్యాక్స్ ఫ్రీ కాదు, ఆయిల్ ప్రైస్ ఎఫెక్ట్: సౌదీలో ఇక 5% వ్యాట్

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వచ్చే ఏడాది అంటే 2018 నుంచి 5 శాతం వ్యాట్ వసూలు చేయనుంది. పలు వస్తువులు, సేవల పైన ఈ వ్యాట్ విధించనుంది.

మూడేళ్ల క్రితం చమురు ధరలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాన్వేషణలో భాగంగా వ్యాట్ వేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆహారం, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాసోలిన్, ఫోన్లు, నీటి బిల్లులు, ఎలక్ట్రికల్ బిల్లులు, హోటల్ రిజర్వేషన్స్ తదితరాలపై వ్యాట్ రానుంది.

 Tax free no more: Saudi Arabia, UAE to roll out VAT in 2018

వ్యాల్యూ యాడెడ్ ట్యాక్సును ఐదు శాతం కంటే ఎక్కువ పెంచడానికి వీలులేకుండా చేస్తున్నట్లు గతంలోనే సౌదీ అరేబీయా ప్రకటించింది. నాన్ ఆయిల్ రెవెన్యూ పెంచుకునేందుకు వ్యాట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

కాగా, వ్యాట్ విషయమై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ధరలు పెరగడానికి ముందే తాను మేకప్‌కు సంబంధించిన ఐటమ్స్ కొనుగోలు చేస్తానని 23 ఏళ్ల ఓ గ్రాడ్యుయేట్ చెబుతున్నారు. తాను మేకప్ లేకుండా ఉండలేనని, ధరలు పెరుగుతాయని కాబట్టి కొనుగోలు చేస్తానని చెప్పారు.

ఇప్పటికే దుబాయ్‌లో చాలా వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉందని, ఇప్పుడు వ్యాట్‌తో కలుపుకుంటే మరింత పెరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Saudi Arabia and the United Arab Emirates, which have long lured foreign workers with the promise of a tax-free lifestyle, plan to impose a 5 percent tax next year on most goods and services to boost revenue after oil prices collapsed three years ago.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి