‘బాంబు తెచ్చావా’: ముస్లిం విద్యార్థినికి టీచర్ ప్రశ్న
అట్లాంటా: అమెరికాలోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల ముస్లిం విద్యార్థినికి అవమానకర అనుభవం ఎదురైంది. జార్జియాలోని ఓ పాఠశాలలో 'బ్యాగ్‌లో బాంబు తీసుకువచ్చావా' అని తన కుమార్తెను ఆమె టీచర్ ప్రశ్నించినట్టు విద్యార్థిని తండ్రి అబ్దిరిజాక్ ఆడెన్ చెప్పారు.
కాగా, ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. స్కూల్లో టీచర్ తన కుమార్తె ను ఆపి 'మానవబాంబా' అని ప్రశ్నించారని, దీంతో తన కుమార్తె ఎంతో బాధపడిందని ఆడెన్ వెల్లడించారు.

ఈ విషయం తెలియగానే స్కూల్ నుంచి తన కుమార్తెను తీసుకువచ్చానని చెప్పారు. 'మేం ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్నాం. మేం ముస్లిం మతానికి చెందినవారమే. ఇతరులను ద్వేషించాలని నేను పిల్లలకు చెప్పలేదు. ఇతరుల కంటే గొప్పని కూడా చెప్పలేదు' అని ఆడెన్ తెలిపారు.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఇది కావాలని చేసిన పని అని తాను అనుకోవడం లేదని చెప్పారు. అయితే జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
ఇచ్చారు.లాస్‌ఏంజిల్స్‌లో కాల్పులు: ఒకరి మృతి
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల ఓ హోటల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి మార్గమధ్యలో మృతిచెందాడు. దుండగులు కాల్పులు జరపడానికి ముందు హోటల్‌లోనే ఉన్నారా? అన్న వివరాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications