గే టీచర్‌తో ట్రంప్ దంపతుల ఫోటో 'వైరల్': స్టైల్ నచ్చిదంటూ కితాబు!..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఓ 'గే' టీచర్‌తో ఫోటో దిగి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. 'గే'తో ట్రంప్ ఫోటో దిగడమేంటి? అన్న సందేహం రావచ్చు. అయితే సదరు గే ఈ ఏడాది ఉత్తమ టీచర్‌గా ఎన్నికైన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్ష భవనం అతనికి ఆహ్వానం పలికింది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ అతనితో ముఖాముఖి భేటీ అయ్యారు. రోడ్ ఐస్ లాండ్‌కు చెందిన నికోస్ గియన్నోపౌలోస్(29) అనే గే.. ఈ ఏడాది టీచర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. దీంతో ట్రంప్‌తో భేటీకి అధ్యక్ష భవనం నుంచి నికోస్‌కు కబురు అందింది. ఈ మేరకు గత మంగళవారం నికోస్ వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష దంపతులతో ఓ ఫోటో కూడా దిగాడు.

TEACHER TOOK 'SASSY' PICTURE WITH DONALD TRUMP TO HIGHLIGHT GAY PRIDE BECAUSE TRUMP WON'T

కాలర్ చుట్టూ గోల్డ్ ఆంకర్, చేతిలో లేస్ ఫ్యాన్ పట్టుకుని అధ్యక్ష దంపతులతో అతను దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు అమెరికన్ మీడియా సంస్థలు.. నికోస్ ఇలాంటి స్టైల్లో ఫోటోలు దిగడం అతని పొగరుబోతు తనానికి నిదర్శనం అంటూ విమర్శించాయి. మరోవైపు ట్రంప్ మాత్రం.. 'నీ స్టైల్ నాకెంతగానో నచ్చింది' నికోస్ కు కితాబు ఇవ్వడం విశేషం. అధ్యక్ష దంపతులతో ఫోటోపై స్పందించిన నికోస్.. ఇలాంటి స్టైల్లో ఫోటో దిగేందుకు ట్రంప్ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని సంతోషం వ్యక్తం చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rhode Island’s teacher of the year saw his face-to-face meeting with Donald Trump go viral after taking a “sassy” picture with the president.
Please Wait while comments are loading...