పాక్ జైలులో తెలుగు ఖైదీ: వివరాలిస్తే విడుదల

భారత్‌కు చెందిన తెలుగు ఖైదీ విడుదలకు పాకిస్థాన్ అధికారులు సిద్ధమయ్యారు. అయితే అతడికి సంబంధించిన పూర్తి వివరాలేవీ లేకపోవడంతో అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఖైదీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కోరింది.
సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రవీందర్ రెడ్డి బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఖైదీ పేరు రమేష్ అని, అతనికి 20ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలని, కుడి చెంపపై పెద్ద పుట్టుమచ్చ ఉందని పేర్కొన్నారు.
ఈ వివరాలతో పోలికలున్న వ్యక్తి కుటుంబం తమని సంప్రదిస్తే పాస్‌పోర్ట్ సిద్ధం చేసి పాకిస్థాన్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తే ఖైదీగా ఉన్న రమేష్‌ను పాకిస్తాన్ విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications