వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Europe:వామ్మో ఇంత వేడా.. రైల్వే సిగ్నల్స్ కూడా కరిగిపోతున్నాయి..

|
Google Oneindia TeluguNews

యూరప్ లోని పలు దేశాల్లో కార్చిచ్చు చెలరేగింది. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, క్రొయేషియా అంతటా చెలరేగిన కార్చిచ్చుల కారణంగా తీవ్రమైన వేడిగాలులతో ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగాయి. ఫలితంగా పలు రైలు సిగ్నల్స్ దెబ్బతింటున్నాయి. వేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యూకే నేషనల్ రైల్వేస్ అధికారిక ట్విట్టర్ కొన్ని పోస్టులు పోస్ట్ చేశారు. వేడితో రైలు సిగ్నలింగ్ పరికరాల కాలిపోయిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "ఈ రోజు ఈస్ట్ కోస్ట్ మెయిన్ లైన్‌లో ప్రయాణించే ముందు మీ ప్రయాణాలను తనిఖీ చేయమని కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకంటే మేము తీవ్ర అంతరాయాన్ని ఆశిస్తున్నాము. పీటర్‌బరో, లండన్ కింగ్స్ క్రాస్ మధ్య మార్గంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మేము లైన్‌ను రిపేర్ చేస్తున్నాము" అని పోస్ట్ లో పేర్కొన్నారు.

 Temperatures are increasing in many countries in Europe. Due to this, train signals are burning in many areas

జార్జ్ ఫోరాక్రెస్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన మరో పోస్ట్‌లో మండుతున్న వేడి కారణంగా భవనం లోపల ఫైర్ స్ప్రింక్లర్లు యాక్టివేట్ అవుతున్నట్లు చూపించారు. దేశంలో తొలిసారిగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, రెండు రోజుల పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

English summary
mercury has alarmingly shot up in parts of Europe that are reeling under a severe heatwave due to wildfires raging across Portugal, Spain, France, Greece and Croatia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X