ఆఫ్ఘనిస్థాన్ లో టెన్షన్ టెన్షన్ : కాబూల్ లో మరిన్ని దాడులు జరిగే అవకాశం .. అమెరికా హెచ్చరిక
ఆఫ్ఘనిస్థాన్ లో దళాలను ఉపసంహరింపజేసి అమెరికా తప్పు చేసిందా? తాలిబన్ల బాధిత దేశంగా ఆఫ్ఘనిస్థాన్ ను తయారు చేసిందా? కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద దాడులకు అమెరికానే కీలక బాధ్యత వహించాలా? ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సి అమెరికానేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో అమెరికా తొందరపడిందని అభిప్రాయపడుతున్నారు.

ఉగ్రదాదులు జరుగుతున్నా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద రద్దీ
ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజుకి దిగజారిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాలిబన్ల వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి క్యూ కట్టారు. ఉగ్రదాడులు జరుగుతున్నా సరే కాబూల్ ఎయిర్ పోర్ట్ వదిలి వెళ్ళటం లేదు.

కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ఉగ్రదాడి మిగిల్చిన విషాదం
ఒకపక్క కాబూల్ ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరుగుతుందని అక్కడ ఉన్న పౌరులంతా దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముందే హెచ్చరికలు జారీ చేసినా అక్కడి నుండి ప్రజలు వెళ్లిపోయిన దాఖలాలు లేవు. ఫలితంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 183 మందికి పైగా ప్రాణాలను పోగొట్టుకోగా, 150 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. అయితే వాస్తవంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇంకా ఎక్కువ మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

మరో షాకింగ్ వార్త చెప్పిన అమెరికా
ఇదిలా ఉంటే ఒకపక్క కాబూల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్ళతో భయానక పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న పౌరులు మాత్రం పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ వద్దనే గుమికూడారు. బాంబుల దాడి భయం వేధిస్తున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటే ఎలాగైనా చావు తప్పదని భావిస్తున్న నేపథ్యంలోనే వారంతా దేశం వదిలి వెళ్లాలని ఎయిర్ పోర్ట్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికా మరో షాకింగ్ వార్త చెప్పి బాంబు పేల్చింది. కాబూల్ విమానాశ్రయంపై మొన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో ఇలాంటి దాడులు మరిన్ని కొనసాగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
Recommended Video

మళ్ళీ దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న అమెరికా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విమానాశ్రయం పరిసరాలలో గుమికూడి ఉండకూడదని సూచిస్తోంది. గురువారం సాయంత్రం జరిగిన కాబూల్ ఉగ్రదాడిలో అమెరికా రక్షణ దళాలకు చెందిన వారు 13 మంది 170 మంది ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాపుల దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇస్లామిక్ స్థావరాలపై దాడులకు దిగారు. కాబూల్ విమానాశ్రయం వద్ద మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ ప్రకటించారు. ఈసారి రాకెట్లు, వాహన బాంబులతో ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకోవచ్చని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అందుకు తగినట్లు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. రష్యా కూడా తమ పౌరులను ఉద్దేశించి ఇదే తరహా హెచ్చరిక చేసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications