శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్‌లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్
శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్‌లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మహేష్ సేననాయకే ఈ విషయాలను చెప్పారు. అయితే వారు ఎందుకు భారత్‌కు వెళ్లారో అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. భారత్‌లో శిక్షణ పొందేందుకు వెళ్లారా అన్న అనుమానం వ్యక్తమవుతోందని మహేష్ సేననాయకే చెప్పారు.
భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందా అన్న ప్రశ్నకు సమాచారం ఇచ్చారని చెప్పారు మహేష్ సేననాయకే. ఇప్పటికే భారత జాతీయ విచారణ సంస్థ తమిళనాడులో కేరళలో కొన్ని చోట్ల దాడులు చేసింది. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులతో ఇక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దాడులకు సంబంధం ఉన్న రియాస్ అబూబకర్‌ను అరెస్టు చేయడంతో తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్ ఆపరేట్ చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో పలు చర్చీలు హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 253 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో ఇలాంటి ఉగ్రదాడి జరగడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. దాడుల వెనక తమ హస్తం ఉన్నట్లు ఐసిస్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
-
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications