ఎలాన్ మస్క్‌ను చుట్టుముట్టిన కష్టాలు: ఆ కీలక కంపెనీకి గుడ్‌బై

వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ను కష్టాలు చుట్టుముట్టినట్టే కనిపిస్తోన్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో జోక్యం చేసుకున్న ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటోన్నాయి. తన పొరుగు దేశంపై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు సవాల్ విసిరిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఓ కీలకమైన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అమెరికా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఎండీవర్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోనున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఎండీవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏరీ ఇమ్మానుయెల్ ధృవీకరించారు. ఎలాన్ మస్క్‌తో తమ ప్రయాణం త్వరలోనే ముగియనుందని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ తమ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవికి రాజీనామా చేయబోతున్నారని చెప్పారు.

Tesla and SpaceX founder Elon Musk will resign from the board of Endeavor

ఎలాన్ మస్క్ రాజీనామా- జూన్ 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌తో పాటు మరో ఏడుమంది ఎండీవర్ హోల్డింగ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తోన్నారు. మస్క్ వైదొలగబోతుండటం వల్ల ఖాళీ అయిన స్థానాన్ని మరో ఇండింపెండెట్ డైరెక్టర్‌తో భర్తీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇమ్మానుయెల్ చెప్పారు. తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ ఈ నెల 12వ తేదీన తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి, కంపెనీ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని ఇమ్మానుయెల్ పేర్కొన్నారు. కంపెనీ ఆపరేషన్స్, పాలసీలను అంగీకరించకపోవడం వల్లే ఎలాన్ మస్క్ తప్పుకొన్నట్లుగా భావించట్లేదని వివరణ ఇచ్చారు. ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. కాగా- ఎండీవర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసిన తొలి సంవత్సరంలోనే ఎలాన్ తప్పుకోవడం కార్పొరేట్ సెక్టార్‌లో చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+